/rtv/media/media_files/2024/11/09/EpBNuv55XLiPRqBHwwUG.jpg)
ఉక్రెయిన్ తో యుద్ధంలో కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఓ వైపు చర్చలు జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్క్స్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ సేనలు లొంగిపోతే వారు ప్రాణాలతో ఉంటారని హెచ్చరించారు. కీవ్ సేనలపై కనికరం చూపాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విజ్ఙప్తి చేసిన వేళ పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
మానవతా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలన్న ట్రంప్ పిలుపు నాకు అర్థమైంది. ఆయన సూచన మేరకు ఓ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నా. ఒకవేళ వారు ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతే వారి ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వగలను.రష్యా ఫెడరేషన్ తో పాటు అంతర్జాతీయ చట్టాల ప్రకారం వారి పై చర్యలు తీసుకుంటామని పుతిన్ వెల్లడించారు.
Also Read: Telangana: మత సామరస్యం చాటుకున్న ఆలయ పూజారి.. ఇంట్లో ముస్లింలకు ఇఫ్తార్ విందు
అధ్యక్షుడి వ్యాఖ్యలను రష్యా టెలివిజన్ ప్రసారం చేసింది. పశ్చిమ రష్యాలోని కర్క్స్ లో కొంత భూభాగాన్ని కీవ్ సేనలు తమ అధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అక్కడ ఉక్రెయిన్ బలగాలు పౌరులపై నేరాలకు పాల్పడుతున్నారని పుతిన్ ఆరోపించారు. దీన్ని కీవ్ తీవ్రంగా ఖండించింది. అక్కడ తమ సైన్యం పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని తెలిపింది.
రష్యాతో యుద్ధానికి సంబంధించి ఇటీవల అమెరికా ఉక్రెయిన్ తో చర్చలు జరిపింది. సౌదీ అరేబియా వేదికగా జరిగిన ఈ చర్చల్లో 30 రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది.ఈ ఒప్పందం పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా స్పందించారు. అమెరికా ప్రతిపాదించిన ఈ ఒప్పందానికి పుతిన్ అనుకూలంగా మాట్లాడారు.
అయితే ఈ కాల్పుల విరమణ అనేది శాశ్వత శాంతికి దారితీయాలని,సంఘర్షణలకు మూల కారణాలను పరిష్కరించాలన్నారు.దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ..రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేసినప్పటికీ..ఒప్పందం ఇంకా కార్యరూపం సంతరించుకోలేదని అన్నారు.
Also Read: Ap Temperature: ఏపీ ప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. ఏకంగా 43 డిగ్రీల ఎండ
Also Read: కాకినాడలో విషాదం.. పసిపిల్లల పాలిట మృత్యువుగా మారిన తండ్రి