/rtv/media/media_files/2025/03/28/Y9Dcf5tAftUHjbRNJC4z.jpg)
Pro-monarchy protestors clash with police in Nepal
Nepal: నేపాల్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాచరిక పాలన, హిందూ దేశ హోదా కోసం అక్కడ గత కాలంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉద్యమకారులు, భద్రత సిబ్బంది మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. భద్రతా సిబ్బందిపై ప్రజలు రాళ్లు విసిరారు. దీంతో సిబ్బంది వాళ్లపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Also Read: ఎత్తైన భవనం కూలిన ఘటనలో 90మంది మిస్సింగ్ ..
ఇదిలాఉండగా
2008లో రాజు జ్ఞానేంద్ర రాచరిక పాలనను రద్దు చేశారు. అప్పటివరకు నేపాల్ హిందూ దేశంగా ఉండేది. అయితే మావోయిస్టు, కమ్యూనిస్టు ప్రభుత్వ విధానాలు అక్కడి ప్రజలకు నచ్చలేదు. దీంతో మళ్లీ తమకు రాచరిక పాలన కావాలని, నేపాల్ హిందూ దేశంగా ఉండాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఇటీవల రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలిపారు. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (RPP) రాచరిక పాలనను ప్రవేశపెట్టాలని కోరుతూ ర్యాలీలో డిమాండ్ చేశారు.
Also Read: మందు బాబుల గుండెలు పిండేసే వార్త.. ఏమిటో తెలిస్తే తట్టుకోలేరు!
ఈ ర్యాలీలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫొటోలు కనిపించడం దుమారం రేపింది. దీనిపై ఆర్‌పీపీ పార్టీ స్పందించింది. ప్రధానమంత్రి ముఖ్య సలహాదారు బిష్ణు రిమాల్ సూచనల మేరకే యోగి ఫొటోలు ప్రదర్శించామని తెలిపింది. ప్రధాని కేపీ ఓలి వర్గం తమ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు కుట్ర చేసిందని ఆరోపణలు చేసింది. మరోవైపు బిష్ణు రిమాల్ మాత్రం ఆర్‌పీపీ చేసిన ఆరోపణలు ఖండించారు. అయితే తాజాగా నేపాల్‌లో మరోసారి రాచరిక పునరుద్ధరణకై నిరసనలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: త్రిభాషా విధానం, డీలిమిటేషన్‌పై టీవీకే పార్టీ సంచలన నిర్ణయం
nepal | telugu-news | rtv-news | protest
Also Read: విమానంలో మహిళలతో యువకుడి అసభ్య ప్రవర్తన.. దిగగానే ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!