/rtv/media/media_files/2025/01/21/n9bsvKQxEczBopJhG14u.jpg)
Lion
Lion Viral Video: సింహాన్ని చూస్తే ఎవరైనా భయపడిపోతారు. ఒకవేళ సింహం బోనులో పడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇలా ఊహిస్తేనే చెమటలు పడుతున్నాయి కదా. అయితే తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తి ఏకంగా సింహం బోనులోకే ప్రవేశించాడు. సరదాగ టిక్‌టాక్ వీడియో చెద్దామని వెళ్లిన ఆ యువకుడు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Also Read: పేపర్ లీకులు.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్ గాంధీ
సింహంతో గేమ్స్ ఆడితే..!
ఇక వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ ప్రావిన్సుకు చెందిన ముహమ్మద్ అజీమ్ అనే వ్యక్తి లాహోర్‌లోని ఓ జంతు సంరక్షణ కేంద్రానికి వెళ్లాడు. అక్కడికి చేరుకున్నాక బోనులో ఉన్న సింహంతో టిక్‌టాక్ వీడియో చేయాలనుకున్నాడు. ఇందుకోసం అక్కడున్న సంరక్షుడి పర్మిషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత అజీమ్ బోనులోకి వెళ్లాడు. దీంతో వెంటనే సింహం అతడిపై దాడికి దిగింది. బాధితుడు గట్టిగా కేకలు వేశాడు. వెంటనే సిబ్బంది వచ్చి అతడిని రక్షించారు.
Also Read: ఘోర అగ్ని ప్రమాదం.. 66 మంది మృతి
అయితే ఈ యువకుడు సింహం దాడిలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. ఆతడిని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పంజాబ్ మంత్రి మరియం ఔరంగజేబు కూడా స్పందించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జంతు సంరక్షణ యాజమాన్యంపై సీరియస్ అయ్యారు. అలాగే ఆ ఫామ్ యాజమాని బ్రీడింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని అధికారులకు ఆదేశించారు. వాస్తవానికి ఈ కేంద్రంలో జంతువుల వీడియోలు, ఫొటోలను టిక్‌టాక్ లాంటి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై ప్రదర్శించడం కూడా నిషేధమే. కాబట్టి యువకుడు నిబంధనలు ఉల్లంఘించి లోపలకి వెళ్లి టిక్‌టాక్ వీడియో చేసేందుకు యత్నించాడు. అలాగే అక్కడున్న సిబ్బంది కూడా ఆ యువకుడికి లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వడంతో వారిపై అధికారులు సీరియస్ అయ్యారు.
Also Read: మహమ్మద్ ప్రవక్తను అవమానించాడని పాప్ సింగర్‌కు మరణ శిక్ష...ఎక్కడో తెలుసా!
Also Read: ట్రంప్ మొదట సంతకాలు చేసిన పది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు ఇవే..