/rtv/media/media_files/2026/05/27/abraham-accords-2026-05-27-12-43-21.jpg)
Abraham Accords
ఎన్నో ఏళ్ల నుంచి ఇజ్రాయెల్, అరబ్ దేశాలకు అస్సలు పడదు. శత్రువులుగా ఉండేవారు. అయితే ఈ గొడవలన్నీ ఆపేసి అందరం ఒకరికొకరు సాయం చేసుకుని వ్యాపారం చేసుకోవాలని అనుకుని.. అమెరికా సాయంతో శాంతి ఒప్పందం చేసుకున్నారు. అవే అబ్రహం ఒప్పందాలు. ఇవి కేవలం రాజకీయ ఒప్పందాలు మాత్రమే కావు.. దశాబ్దాల నుంచి ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య ఉన్న శత్రుత్వాన్ని నాశనం చేసి.. స్నేహాన్ని పెంచే ఒప్పందాలు. అయితే ఈ అబ్రహం ఒప్పందాల్లో ఏయే అరబ్ దేశాలు ఉన్నాయి? ఈ పేరు ఎలా వచ్చింది? అమెరికా మధ్య వర్తిత్వంగా ఎందుకు ఉంది? పాకిస్తాన్ ఎందుకు ఈ ఒప్పందాలను వ్యతిరేకిస్తుంది? అసలు ఆ ఒప్పందాల్లో ఏముంది? అనే పూర్తి వివరాలు మీకోసం.
ఇది కూడా చూడండి: Prabhas Spirit: ప్రభాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెషల్’ అప్డేట్!
అబ్రహం పేరే ఎందుకు?
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మధ్యవర్తిత్వంతో 2020లో ఇజ్రాయెల్, పలు అరబ్ దేశాల మధ్య కుదిరిన దౌత్యపరమైన ఒప్పందాల సమూహం. అప్పటి వరకు ఇజ్రాయెల్ దేశాన్ని గుర్తించని అరబ్ దేశాలు.. ఈ ఒప్పందంతో వ్యాపారాలు చేయడానికి అధికారిక సంబంధాలను ఏర్పరుచుకున్నాయి. అయితే ఈ ఒప్పందానికి అబ్రహం అనే పేరు పెట్టడానికి ఓ కారణం ఉంది. అబ్రహం అనే వ్యక్తి యూదు, క్రైస్తవ, ఇస్లాం మతాలకు మూలపురుషుడు. మూడు మతాలు అతన్ని తమ నాయకుడిగా గుర్తిస్తాయి. ఈ కారణంగానే మూడు మతాల మధ్య శాంతిని నెలకొల్పి, పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ పేరును పెట్టారు. ఇది కేవలం రెండు దేశాల మధ్య కాకుండా.. మతాల మధ్య కూడా శాంతి ఉండాలనే సంకేతంతో ఈ ఒప్పందాలకు అబ్రహం పేరు పెట్టారు.
ఎప్పుడు మొదలయ్యాయంటే?
ఈ అబ్రహం ఒప్పందాలపై మొదట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అమెరికా మధ్యవర్తిత్వంతో సంతకం చేసింది. ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నట్లు 2020 ఆగస్టులో యూఏఈ ప్రకటించింది. ఆ తర్వాత UAE బాటలోనే నడుస్తూ బహ్రెయిన్ అక్కడికి కొన్ని రోజుల్లోనే తన మద్దతును ప్రకటించింది. ఆ తర్వాత 2020 చివరిలో మొరాకో, సూడాన్ ఇజ్రాయెల్‌తో ఒప్పందం చేసుకుంది. అయితే అప్పట్లో యుద్ధాలను ఆపడానికి వీటి కంటే ముందే ఈజిప్ట్ (1979), జోర్డాన్ (1994) ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందాలు చేసుకున్నాయి. కానీ అరబ్ దేశాలు ఇజ్రాయెల్‌తో వ్యాపారం, పర్యాటకం, టెక్నాలజీ, విమాన సర్వీసులు వంటి రంగాల్లో మద్ధతు కోసం 2020లో ఈ అబ్రహం ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అయితే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఇతర నేతలు సౌదీ అరేబియా, ఓమన్, ఖతార్ వంటి దేశాలను కూడా ఈ కూటమిలో చేరాలని కోరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఈ ఒప్పందాలను మరింత విస్తరిస్తానని తెలిపారు. అలాగే ఇరాన్‌ను దెబ్బతీసేందుకు ఈ దేశాలు అన్నింటిని కలిపి అతిపెద్ద యాంటీ-ఇరాన్ ఫోర్స్‌గా మారుస్తానని ప్రకటించారు. అంతేకాకుండా.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ను ఉద్దేశించి ట్రంప్ వ్యా్ఖ్యలు చేశారు. దీంతో ఈ ఒప్పందాలకు పాకిస్తాన్ దూరంగా ఉంటోంది.
ఇది కూడా చూడండి: Tamil Nadu : తమిళనాడులో STF చీఫ్ గా 'లేడీ సింగం'భవానీశ్వరి? ఇంతకు ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా?
పాకిస్తాన్ నో అనడానికి కారణం?
ఈ అబ్రహం ఒప్పందాలను పాకిస్తాన్ వ్యతిరేకిస్తోంది. దీనికి ముఖ్యమైన కారణాలు రాజకీయ, మతపరమైన సిద్ధాంతాలు. పాకిస్తాన్ మొదటి నుంచి పాలస్తీనాకు మద్దతు ఇస్తోంది. ఇజ్రాయెల్‌ను దేశంగా గుర్తించిందంటే.. పాలస్తీనా పట్ల చేస్తున్న అన్యాయాన్ని సమర్థించడమేనని పాక్ భావిస్తోంది. దేశంలో ఉన్న ఈ మతపరమైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని వెనకడుగు వేస్తోంది. ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకోవడమంటే.. ఆత్మహత్యతో ఈక్వెల్ అని నమ్ముతోంది. అలాగే ఇరాన్‌తో పాకిస్తాన్‌కు ఉన్న అటాచ్‌మెంట్ వల్ల ఇజ్రాయెల్‌తో చేతులు కలపడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు.
ఈ ఒప్పందాల్లో ఏముంది?
ఈ ఒప్పందాలు కేవలం రాజకీయంగా మాత్రమే కాదు.. ఇజ్రాయెల్, అరద్ దేశాలకు కూడా ప్రయోజనాలు ఉన్నాయి. ఇరు దేశాల మధ్య రాయబార కార్యాలయాల ఏర్పాటు, డైరెక్ట్‌గా విమాన సర్వీసుల నడపడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం వంటివి ఉన్నాయి. అలాగే సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయ సాంకేతికత, నీటి నిర్వహణ, రక్షణ రంగంలో పరస్పర సహకారం పెంచుకోవడం, మతపరమైన పర్యాటకం అంటే జెరూసలేం సందర్శన ఈజీ కావడం వంటి వాటిపై ఈ ఒప్పందాల్లో సంతకాలు చేసుకున్నాయి.
Follow Us