Pakisthan: పాకిస్థాన్‌లో అల్లర్లు.. 25 మంది అరెస్టు

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని నిరసనలు జరుగుతున్నాయి. తాజాగా అక్కడి మిలటరీ కోర్టు 25 మంది పౌరులకు జైలుశిక్ష విధించింది. వీళ్లకు 2 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది.

New Update
Pakisthan Riots

Pakisthan Riots

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని గత కొంతకాలంగా అక్కడ నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్థాన్ తెహ్రీక్ -ఏ- ఇన్సాఫ్‌ (PTI) పార్టీ కార్యకర్తలు సైనిక స్థావరాలపై కూడా దాడులకు పాల్పడ్డారు. దీంతో అక్కడి మిలటరీ కోర్టు తాజాగా 25 మంది పౌరులకు జైలుశిక్ష విధించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది మేలో పీటీఐ చీఫ్‌ ఇమ్రాన్ ఖాన్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టును నిరసిస్తూ మద్దతుదారులు నిరసనలు చేపట్టడంతో ఇవి అల్లర్లకు దారి తీశాయి.      

Also Read: అయ్యో.. హుండిలో పడిపోయిన ఐఫోన్‌.. ఇవ్వమంటున్న ఆలయ అధికారులు

ఆ సమయంలో రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంతో సహా ఫైసలాబాద్‌లోని ఐఎస్‌ఐ భవనం, ఇతర సైనిక స్థావరాలపై నిరసనాకారులు దాడులు చేశారు. దీంతో పోలీసులు దేశవ్యాప్తంగా వందలాది మంది అనుమానితుల్ని అరెస్టు చేశారు. విచారణ కోసం 103 మందిని మిలటరీ అధికారులకు అప్పగించారు. దీంతో తాజాగా ఈ వ్యవహారంపై మిలిటరీ కోర్టు విచారణ చేపట్టింది. అందులో 25 మందిని దోషులకుగా తేల్చింది. వీళ్లకు 2 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించింది.    

Also Read: శ్రీతేజ్ ఇప్పట్లో కోలుకోడు.. నాకే భయమేసింది: కోమటిరెడ్డి ఎమోషనల్!

మిగిలిన వాళ్లకు కూడా శిక్ష విధిస్తామని.. గడువు ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ విషయాన్ని పరిశీలిస్తామని కోర్టు చెప్పింది. ఇదిలాఉండగా.. వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమ్రాన్ ఖాన్‌ గత ఏడాది నుంచి అడియాలా జైల్లో ఉంటున్నారు. ఆయన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీటీఐ పార్టీ మద్దతుదారులు గత నెలలో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలపాలయ్యారు.

Also Read: రాహుల్ గాంధీపై నమోదైన కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ

Also Read: రుణమాఫీ 70శాతమే.. 100శాతం అని చెప్పడానికి సిగ్గుండాలి: కేటీఆర్

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Zelensky: క్రిమియాపై ఉక్రెయిన్‌ సంచలన కామెంట్స్‌..

క్రిమియా రష్యాతోనే ఉంటుందని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఉక్రెయిన్ స్పందించింది. క్రిమియాను తాము ఎప్పటికీ కూడా రష్యాలో భాగంగా గుర్తించమని స్పష్టం చేసింది. అమెరికా శాంతి ప్రతిపాదనలకు అసలు అర్థమే లేదని పేర్కొంది.

New Update
Zelensky

Zelensky

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై రష్యా నియంత్రణను అమెరికా గుర్తించిందని ఇటీవల ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఇకనుంచి క్రిమియా రష్యాతోనే ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై తాజాగా ఉక్రెయిన్ స్పందించింది. అమెరికా శాంతి ప్రతిపాదనలో క్రిమియాపై రష్యా అధికారం ఉంటుందని చెప్పడం షాక్‌కు గురిచేసిందని తెలిపింది. 

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

Ukraine Comments On Crimea

క్రిమియాను తాము ఎప్పటికీ కూడా రష్యాలో భాగంగా గుర్తించమని స్పష్టం చేసింది. అమెరికా శాంతి ప్రతిపాదనలకు అసలు అర్థమే లేదని జెలెన్‌స్కీ పార్టీ శాసనసభ్యుడు ఒలెక్సాండర్‌ మెరెజ్ఖో తెలిపారు. రష్యాను క్రిమియా చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని.. దాన్ని ఆ దేశానికి పూర్తిగా ఇచ్చేయడం అసాధ్యమన్నారు. ఇందుకోసం తమ దేశ రాజ్యాంగంలో మార్పులు చేయాలని.. అలాగే దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అంగీకారం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

క్రిమియాను వదులుకోవడం అంటే తమ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రాజకీయ ఆత్మహత్యతో సమానమని తెలిపారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దీన్ని తమ దేశంలో రాజద్రోహంగా భావిస్తామన్నారు. ఇదిలాఉండగా. దక్షిణ ఉక్రెయిన్‌లో నల్ల సముద్రం వెంట క్రిమియా ప్రాంతం ఉంది. అయితే 2014లో రష్యా దాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also Read :  నక్సలైట్లను చంపొద్దు.. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపండి: కేసీఆర్ సంచలనం!

telugu-news | rtv-news | russia-ukraine | zelensky | trump 

Advertisment
Advertisment
Advertisment