Pakistan: పాకిస్థాన్‌కు మరో బిగ్ షాక్.. రూ.12,500 కోట్ల డీల్ క్యాన్సిల్

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. సూడాన్‌కు యుద్ధ విమానాలు, ఆయుధాలను సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12,500 కోట్లు) రక్షణ ఒప్పందాన్ని పాక్ నిలిపివేసింది.

New Update
Pakistan has put a $1.5 billion sale of Sudanese weapons on hold due to Saudi objection

Pakistan has put a $1.5 billion sale of Sudanese weapons on hold due to Saudi objection

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు మరో భారీ షాక్ తగిలింది. సూడాన్‌కు యుద్ధ విమానాలు, ఆయుధాలను సరఫరా చేసేందుకు కుదుర్చుకున్న 1.5 బిలియన్ డాలర్ల (సుమారు రూ.12,500 కోట్లు) రక్షణ ఒప్పందాన్ని పాక్ నిలిపివేసింది. ఈ భారీ ఒప్పందానికి సౌదీ అరేబియా నిధులు సమకూర్చాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక సహాయం చేయలేమని చెప్పడంతో పాకిస్థాన్ ఈ ఒప్పందాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చింది.  గతేడాది భారత్‌తో జరిగిన ఘర్షణల తర్వాత తన ఆయుధాల మార్కెట్‌ను పెంచుకోవాలని భావించిన పాకిస్థాన్ సైన్యానికి కోలుకోలేని దెబ్బ పడింది. 

Also Read: విజయ్‌కు మరో బిగ్ షాక్.. ఎన్నికల అఫిడవిట్‌లో రూ.100 కోట్ల తేడా

గత మూడేళ్లుగా సూడాన్‌లో అధికార సైన్యానికి, పారామిలిటరీ దళాలకు (RSF) మధ్య జరుగుతున్న అంతర్యుద్ధం జరుగుతోంది. దీంతో అక్కడ మానవతా సంక్షోభానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఆ దేశానికి ఆయుధాలు సరఫరా చేస్తే యుద్ధం మరింత ముదిరే ప్రమాదం ఉందని పాశ్చాత్య దేశాలు సౌదీ అరేబియాను హెచ్చరించాయి. అందుకే 'పరోక్ష యుద్ధాలకు' దూరంగా ఉండాలనే వ్యూహంతో ఈ ఒప్పందం నుంచి సౌదీ తప్పుకుంది. సౌదీ నుంచి ఆర్థిక సాయం లేకపోవడంతో, పాకిస్థాన్‌.. సూడాన్‌తో పాటు లిబియా నేషనల్ ఆర్మీతో కుదుర్చుకున్న మరో 4 బిలియన్ డాలర్ల ఒప్పందం కూడా ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది.

Also Read: రూ.79,450 కోట్లు బూడిదపాలు.. రేపు ఓపెనింగ్, ఈరోజు కాలిపోయిన రిఫైనరీ ఫ్యాక్టరీ

భౌగోళికంగా బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న సూడాన్ ప్రస్తుతం విదేశీ శక్తుల జోక్యం వల్ల అతలాకుతలమవుతోంది. ఇక్కడ శాంతిని తీసుకొచ్చేందుకు దౌత్యపరమైన పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సౌదీ యోచిస్తోంది . అయితే తన ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు సౌదీ రుణాలపైనే పాకిస్థాన్ పూర్తిగా ఆధారపడింది. దీంతో తాజాగా ఆ దేశం తీసుకున్న నిర్ణయానికి పాక్ తలొగ్గక తప్పలేదు. అయితే ఈ పరిణామం పాక్ రక్షణ ఎగుమతుల ఆశలపై నీళ్లు చల్లడమే కాక.. అంతర్జాతీయంగా ఆ దేశం యొక్క దౌత్య పరిమితులప మళ్లీ బయటపడ్డాయి.  

Advertisment
తాజా కథనాలు