/rtv/media/media_files/2026/04/20/pakistan-expects-us-financial-aid-for-hosting-peace-talks-in-islamabad-2026-04-20-15-53-01.jpg)
pakistan expects us financial aid for hosting peace talks in islamabad
ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. పెరిగిన ద్రవ్యోల్బణ, కరెన్సీ విలువ పడిపోవడంతో అక్కడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలోనే పాక్ తన దౌత్య వ్యూహాలకు పదునుపెట్టింది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఇస్లామాబాద్ వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. రెండోసారి కూడా అక్కడే ఇరుదేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. అందుకే అమెరికా నుంచి పాక్ ప్రభుత్వం భారీ ఆర్థిక ప్యాకేజీని బహుమతిగా పొందాలని ఆశిస్తోంది. గతంలో 1980, 2000 ప్రారంభంలో అమెరికా నుంచి మధ్యవర్తిత్వ అద్దె ద్వారా బిలియన్ల డాలర్లు పొందిన పాక్.. ఈసారి కూడా అలాంటి వ్యూహాన్నే అనుసరిస్తోంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఈ బేరసారాల పద్ధతి కొనసాగే ఛాన్స్ లేదని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
Also Read: అమెరికాకు గల్ఫ్ దేశాల షాక్.. అగ్రరాజ్యాన్ని నమ్మితే నట్టేట ముంచిన ట్రంప్
గతంలో మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ప్రాంతీయ అస్థిరత వల్ల పాకిస్థాన్‌కు బిలియన్ డాలర్ల సాయం అందేది. అలాగే ఉచిత రుణమాఫీలు, గ్రాంట్లు అందేవి. కానీ ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. పెరుగుతున్న ఉద్రిక్తతల వల్ల విదేశీ పెట్టుబడిదారులు వెనుకంజ వేస్తుండటంతో డాలర్ నిల్వలు తగ్గిపోతున్నాయి. దీంతో పాత అప్పులు తీర్చడమే పాక్‌కు భారంగా మారింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కూడా పాత దౌత్య విధానాలు ఫెయిల్ అవుతున్నట్లు అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి.
పాకిస్థాన్ ఇప్పటిదాకా కేవలం అవకాశవాద రాజకీయాలనే నమ్ముకుంది. కానీ ఓ పటిష్టమైన ఆర్థిక పునాదిని నిర్మించుకోలేకపోయింది. అంతర్జాతీయ వేదికలపై అనేక సమావేశాలు నిర్వహించిన పాక్ కేవలం ఫొటోలకే పరిమితమైంది. వాటిని దీర్ఘకాలిక వ్యాపార ఒప్పందాలుగా లేదా చమురు రంగంలో పెట్టుబడులుగా మార్చే విషయంలో మాత్రం విఫలమైంది. యుద్ధం ఉన్నప్పుడు నిధులు రావడం, శాంతి ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం పాక్‌కు అలవాటుగా మారింది. ఈ ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడాలంటే పాక్ విదేశీ సహాయంపై ఆధారపడటం మానుకోవాలని నిపుణులు సూచనలు చేస్తున్నారు.
Also Read: గాల్లో 4 గంటల నరకం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు!
ప్రస్తుతం చూసుకుంటే నేషనల్ క్యాపిటల్ కమాండ్ (NCC) లాంటి పటిష్టమైన వ్యవస్థ అవసరమనే డిమాండ్ పెరుగుతోంది. కేవలం 90 రోజుల్లోనే అన్ని పర్మిషన్లు ఇచ్చి, ప్రతి దౌత్య సంబంధాన్ని ఫొటోలకు మాత్రమే పరిమితం కాకుండా వ్యాపార ఒప్పందంగా మార్చడమే దీని లక్ష్యం. పాకిస్థాన్ తమ భౌగోళిక ప్రాధాన్యతను ఆదాయ వనరుగా మార్చుకోకుంటే మరింత నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే పాక్‌ను ఇప్పుడు అమెరికా మళ్లీ ఆదుకుంటుందా? లేదా? అనేది ఆసక్తిగా మారింది.
Follow Us