Clearance Operation: బలూచిస్తాన్‌లో హై అలర్ట్.. 40 గంటల్లో 145 మందిని చంపిన పాక్ ఆర్మీ

గత 40 గంటలుగా బలూచిస్తాన్‌లో పాక్ సైన్యం చేపట్టిన 'క్లియరెన్స్ ఆపరేషన్'లో 145 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ ఆదివారం అధికారికంగా వెల్లడించింది. ఈ ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం సంభవించడమే కాకుండా, సాధారణ పౌరులు కూడా బలైపోయారు.

New Update
Balochistan

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ ప్రస్తుతం రణరంగాన్ని తలపిస్తోంది. గత 40 గంటలుగా అక్కడ పాకిస్థాన్ సైన్యం చేపట్టిన 'క్లియరెన్స్ ఆపరేషన్'(clearance operation) లో ఇప్పటివరకు 145 మంది మిలిటెంట్లు హతమయ్యారు. ఈ విషయాన్ని పాక్ ఆర్మీ(pakistan-army) ఆదివారం అధికారికంగా వెల్లడించింది. ఈ ఘర్షణల్లో భారీగా ప్రాణనష్టం సంభవించడమే కాకుండా, సాధారణ పౌరులు కూడా బలైపోయారు. ఈ దాడుల్లో 17 మంది లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, 31 మంది పౌరులు మరణించారని బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫ్రాజ్ బుగ్టి తెలిపారు. శనివారం 92 మంది ఉగ్రవాదులు మరణించగా, శుక్రవారం 41 మంది మరణించారని పాకిస్తాన్ సైన్యం తెలిపింది.

Also Read :  ఇరాన్‌ పోర్టులో భారీ పేలుడు.... కారణం ఏంటంటే?

Pakistan Army Kiled 145 Clearance Operation In Balochistan

ఎదురుకాల్పుల సమయంలో 15 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోగా, దురదృష్టవశాత్తూ 18 మంది సాధారణ పౌరులు కూడా ఈ హింసకు బలైపోయారు. ఈ దాడులకు తామే బాధ్యులమని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(balochistan pakistan army) (BLA) ఇప్పటికే ప్రకటించింది. తాము డజన్ల సంఖ్యలో పాక్ సైనికులను హతమార్చామని రెబల్స్ పేర్కొనడం గమనార్హం.

ప్రావిన్సు రాజధాని క్వెట్టాతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో మిలిటెంట్ల ప్రణాళికలను భగ్నం చేసేందుకు సైన్యం కఠిన చర్యలు తీసుకుంటోంది. క్వెట్టాలోని కీలక భవనాలు, ప్రధాన రహదారులను సైన్యం తన ఆధీనంలోకి తీసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఫోన్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. రైలు రాకపోకలపై నిషేధం విధించి, రవాణా వ్యవస్థను స్తంభింపజేశారు. బలూచిస్తాన్‌లో నెలకొన్న అశాంతిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందిస్తూ, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. దేశ సమగ్రతకు భంగం కలిగించే శక్తులను వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం క్వెట్టా మరియు పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది, ప్రజలు తీవ్ర భయాందోళనల మధ్య గడుపుతున్నారు.

Also Read :  బంగాళాఖాతంలో నో ఫ్లైయింగ్ జోన్.. ఇండియా పెద్ద ప్లానే!

Advertisment
తాజా కథనాలు