/rtv/media/media_files/2026/04/11/pakistan-2026-04-11-16-58-22.jpg)
Pakistan announced a two-day public holiday in Islamabad
పాకిస్థాన్(pakistan) రాజధాని ఇస్లామాబాద్(islamabad) లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇస్లామాబాద్‌లో రెండు రోజుల పాటు ప్రభుత్వ సెలవులు ప్రకటించింది. ఈ అంతర్జాతీయ స్థాయి సమావేశం సజావుగా జరిగేందుకు పాక్ ప్రభుత్వం నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ప్రధాన కూడళ్లలో సాయుధ బలగాలను మోహరించింది. ఎక్కడిక్కడా పోలీసు చెక్‌పోస్టులను కూడా ఏర్పాటు చేసింది.
మరోవైపు భద్రతా కారణాల దృష్ట్యా ఇస్లామాబాద్‌లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. వాహనాల రాకపోకలను ప్రత్యామ్నాయ రూట్‌లకు మళ్లిస్తున్నారు. అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్చలకు ప్రపంచ దేశాల ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇస్లామాబాద్‌ను ఓ సురక్షిత జోన్‌గా మార్చేశారు.
అమెరికా, ఇరాన్(America-Iran) ప్రతినిధుల మధ్య ఈ శాంతి చర్చలు పరోక్ష పద్ధతిలో జరగనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఒమన్ మధ్యవర్తిత్వంలో ఇరుదేశాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా ఒమన్ తరహాలోనే ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ దేశాల బృందాలు వేర్వేరు గదుల్లో కూర్చుంటాయి. పాక్ అధికారులు ఒకరి ప్రతిపాదనలను మరొకరికి చేరవేస్తూ ఈ శాంతి ప్రక్రియలో కీలకంగా వ్యవహరించనున్నారు.
అమెరికా ఎంబసీపై దాడులు
ఇదిలాఉండగా ఇటీవల ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా పాకిస్థాన్‌లోని కరాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్‌ను వందలాది మంది నిరసనకారులు ముట్టడించారు. లోపలికి చొచ్చుకెళ్లే యత్నించారు. కిటికీ అద్దాలను పగులగొట్టి.. అక్కడున్న వాహనాలకు నిప్పు పెట్టారు. పరిస్థితులు కంట్రోల్ తప్పడంతో అక్కడున్న అమెరికా మెరైన్ గార్డ్స్, పాక్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో 10 నుంచి 16 మంది నిరసనకారులు మృతిచెందారు. మరో 60 మందికి పైగా గాయపడ్డారు. అయితే ఇలాంటి అవాంఛనీయ ఘటనలు ఇస్లామాబాద్‌లో జరగకుండా ఉండేందుకే పాక్ ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.
Also Read: ఇరాన్‌కు సైనికుడిగా.. అమెరికాకు నాయకుడిగా.. మునీర్ 'డ్రెస్ కోడ్' వెనుక రహస్యం అదేనా..
Follow Us