/rtv/media/media_files/2025/04/13/j1gWhg3nw5pFtR9yRI7D.jpg)
Over 860,000 Afghans left Pakistan
పాకిస్థాన్ బహిష్కరణ వేటు మొదలుపెట్టింది. తమ దేశంలో అక్రమంగా ఉంటున్న అఫ్గానిస్థానీయులను స్వదేశానికి పంపిస్తోంది. 2023 సెప్టెంబర్‌లో ఈ బహిష్కరణ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటిదాకా దాదాపు 8.60 లక్షలకు పైగా అఫ్గానిస్థాన్ శరణార్థులు పాకిస్థాన్‌ను వీడినట్లు సమాచారం. వీళ్లలో దాదాపు 5 లక్షల మంది ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఉన్న రెండు సరిహద్దు క్రాసింగ్‌ల ద్వారా అఫ్గాన్‌కు వెళ్లిపోయినట్లు పాకిస్థాన్ మీడియా తెలిపింది.
Also Read: గర్ల్‌ఫ్రెండ్‌ను సూట్‌కేసులో తీసుకెళ్లిన ఘటనలో బిగ్ ట్విస్ట్.. స్పందించిన యూనివర్సిటీ
తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్న అఫ్గానిస్థాన్ శరణార్థులను దశలవారీగా వాళ్ల దేశానికి పంపించాలని పాక్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 2023లో మొదటి దశను ప్రారంభించింది. సరైన డాక్యుమెంట్స్ లేకుండా అక్రమంగా ఉంటున్నవాళ్లని మాత్రమే తొలి దశలో పంపింది. 2023 సెప్టెంబర్ 15 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 5 వరకు 8,61,763 మంది స్వదేశానికి తిరిగి వెళ్లిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది.
Also Read: మూడే మూడు పెగ్గులు.. సైకిల్‌తో రోడ్‌రోలర్‌ను ఈడ్చుకుంటూ- రయ్ రయ్
ఇక అఫానిస్థాన్ సిటిజన్ కార్డు (ACC) ఉన్నవాళ్లందరూ మార్చి 31 నాటికి తమ దేశం విడిచి వెళ్లాలని.. లేదంటే బహిష్కరణ వేటు తప్పదని ఈ ఏడాది జనవరిలోనే పాక్ హెచ్చరించింది. ఈ క్రమంలోనే తాజాగా వాళ్లను బహిష్కరించే చర్యలను ఏప్రిల్ 1న ప్రారంభించింది. ఇప్పటిదాకా 16 వేల మందికి పైగా అఫ్గాన్ సిటిజన్ కార్డు ఉన్నవాళ్లు పాక్‌ను వీడారు. వీళ్లలో 9 వేల మంది స్వచ్ఛంగానే వెళ్లారు. ఆరు వేల మందిపై పాక్ బహిష్కరణ వేటు వేసింది.
Also Read: జలియన్ వాలాబాగ్ మారణకాండకు నేటికి 106 ఏళ్లు.. బ్రిటిష్ వాళ్ల ఊచకోతకు కారణం ఏంటి ?
telugu-news | rtv-news | pakistan | afganisthan | national-news