/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-11-1-jpg.webp)
Russia-UkraineWar
రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో కేరళ యువకుడు మరణించినట్లు తెలుస్తోంది. ఇతను రష్యా సైన్యంలో పని చేస్తున్నాడు. కేరళ కు చెందిన టిబీ బినిల్ గా అతనిని గుర్తించారు. బినీల్ వయసు 32 ఏళ్ళు. ఇతని సమీప బంధువు కూడా యుద్ధంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. టీకే జైన్ అతని పేరు అని చెబుతున్నారు. బనీ మరణించినట్లు అని బంధువులకు సమాచారం అందించారు. మాస్కోలోని రాయబార కార్యాలయం తమకు ఈ విషయం తెలిపిందని చెప్పారు.
Also Read: Delhi: ఢిల్లీలో అంబరాన్నింటిన సంక్రాంతి వేడుకలు
ఎలక్ట్రిషియన్, ప్లంబర్లుగా...
బినిల్‌కు పెళ్ళయింది. అతని భార్య కేరళలోనే ఉంటారు. అతను చనిపోయిన విషయం తెలిసి బినీల్ భార్య షాక్‌కు గురయ్యింది. ఆయన్ను రష్యా నుంచి సురక్షితంగా తీసుకురావాలని అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్న సమయంలోనే ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని వాపోయారు. త్రిశ్శూరుకు చెందిన బినీల్, జైన్‌లు ఐటీఐ మెకానికల్ డిప్లొమా పూర్తి చేశారు. ఎలక్ట్రిషయన్లు, ప్లంబర్లుగా పనిచేయడానికి వారిద్దరూ ప్రైవేటు వీసాతో గతేడాది 4న రషయాకు వెళ్ళరు. కానీ అక్కడకు వెళ్ళగానే వారి పాస్‌పోర్టు రద్దు చేసింది రష్యా. దాని తరువాత మిలటరీ సపోర్టు సర్వీస్‌లో భాగంగా యుద్ధంలోకి దింపింది. తమను తమ దేశానికి తీసుకెళ్ళాలని బినీల్, జైన్లు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. వారిని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఆలోపునే బినీల్ చనిపోయారు.
Also Read: Khargpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో థర్డ్ ఇయర్ విద్యార్థి ఆత్మహత్య