ఆ దేశంలో విచ్చలవిడిగా సె*క్స్.. ప్రతి నలుగురిలో ఒకరికి HIV..

ప్రపంచాన్ని వణికించే అతిప్రమాదరకమైన వైరస్‌లలో HIV ఒకటి. అయితే ఓ దేశంలో మాత్రం ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. అక్కడ ప్రతి నలుగురిలో ఒకరు HIVతో బాధపడుతున్నారు. ఇంతకీ అదెక్కడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

New Update
One in four people have HIV Uncontrolled spread in Eswatini

One in four people have HIV Uncontrolled spread in Eswatini

ప్రపంచాన్ని వణికించే అతిప్రమాదరకమైన వైరస్‌లలో HIV ఒకటి.  ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ వ్యాధి బాధితులు ఉన్నారు. ఏటా లక్షలాది మంది చనిపోతున్నారు. అయితే ఓ దేశంలో మాత్రం ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. అక్కడ ప్రతి నలుగురిలో ఒకరు HIVతో బాధపడుతున్నారు. ఇంతకీ అదెక్కడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. దక్షిణ ఆఫ్రికాలోని ఎస్వతిని (పూర్వనామం స్వాజిలాండ్)  అతిచిన్న దేశం ఉంది. ఇక్కడి ప్రజలు  ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు.

ఎస్వతిలో కేవలం 12 లక్షల జనాభా మాత్రమే ఉంది. ఇక్కడ దాదాపు 3 లక్షల మందికి అంటే ప్రతీ నలుగురిలో ఒకరికి హెచ్‌ఐవీ సోకడం కలకలం రేపుతోంది. ప్రతి సంవత్సరం ఆ దేశంలో కొత్తగా సుమారు 7 వేల మంది ఈ వ్యాధికి గురవుతున్నారు. దీన్ని బట్టి అక్కడి పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకున్నారు. వాళ్లకు ఇలాంటి దుస్థితి రావడానికి ప్రధాన కారణం పేదరికం, అలాగే కొన్ని సామాజిక ఆచారాలు పాటించడం. ఈ దేశ జనాభాలో 60 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్నారు. 

Also Read: 50 అణు రియాక్టర్లు నిర్మిస్తాం.. చైనా సంచలన ప్రకటన

ఎస్వతి ప్రజలు జీవనోపాధి కోసం దక్షిణాఫ్రికాలోని గనుల్లో కూలీ పనులకు వెళ్తారు. అక్కడుంటే గనుల యజమానులు ఎస్వతిని మహిళలతో తమ శృంగార కోరికలు తీర్చుకుంటారు. సురక్షితం కాని లైంగిక పద్ధతులతో పాటు, బహుభార్యత్వం, సంప్రదాయాల పేరిట సాగే విచ్చలవిడి శృంగారం వల్లే అక్కడ ఈ మహమ్మారి వేగంగా విస్తరించింది. ఇక్కడ స్కూల్‌కు వెళ్లే పిల్లలు కూడా శృంగారంలో పాల్గొంటారు.  

1986లో ఎస్వతిలో మొదటి HIV కేసు నమోదైంది. అప్పటినుంచి అక్కడి ప్రభుత్వం ఎయిడ్స్ నివారణకు పోరాడుతూనే ఉంది. వ్యాధి సోకిన వాళ్లకు చికిత్స అందిస్తూ మరణాల రేటును తగ్గించడంలో కొంత విజయం సాధించింది. అయినప్పటికీ మందుల కొరత వాళ్లకు పెద్ద సవాలుగా మారింది. HIV నివారణలో కీలకమైన 'లెనాకాపవిర్' డోసులు కావాల్సినంత అందుబాటులో లేవు. గ్లోబల్ ఫండ్ ద్వారా అందాల్సిన కోటాలో సగం మాత్రమే అందుతున్నాయి. దీంతో ఈ మహమ్మారిని అక్కడ పూర్తిగా నిర్మూలించడం ఆ దేశానికి కత్తిమీద సాములా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న యువత ఈ మహమ్మారి బారిన పడుతున్న దేశాల్లో ఎస్వతిని మొదటి స్థానంలో నిలిచింది.

Also Read: నికోలస్ మదురో నిర్బంధంపై పందెం.. రూ.3 కోట్లు గెలుచున్న సైనికుడు

Advertisment
తాజా కథనాలు