/rtv/media/media_files/2025/03/26/YledYK1BWih1oE6JTFR5.jpg)
nato Photograph: (nato)
NATO: రష్యాకు నాటో (NATO) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కూటమిలోని పోలాండ్ లేదా ఏ దేశం జోలికొచ్చినా వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు. పుతిన్ అయినా, మరెవరైనా సరే.. తమపై ఆధిపత్యం సాధించాలనుకునే అది పొరపాటే అవుతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు.
పూర్తిస్థాయిలో విరుచుకుపడతాం..
ఈ మేరకు పోలాండ్, ఇతర సభ్యదేశాల భద్రతకు నాటో కట్టుబడి ఉందని ఆయన అన్నారు. మాపై దాడి చేసి తప్పించుకోగలమని ఎవరైనా అనుకుంటే అది వారి పెద్ద తప్పిదమే అవుతుందన్నారు. అలాంటి వారిపై పూర్తిస్థాయిలో విరుచుకుపడతామని, వారి ప్రతిచర్యతో వినాశకర పరిణామాలు తప్పవంటూ పోలాండ్ పర్యటనలో వార్నింగ్ ఇచ్చారు. ఇక అమెరికా-, రష్యాల మధ్య చర్చల ఫలితాలు ఏలా ఉన్నా.. వాటికి సిద్ధంగా ఉండాలని పోలాండ్ పీఎం డొనాల్డ్ టస్క్ అన్నారు.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
మరోవైపు.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్ చేశారు. కీవ్‌తో కాల్పుల విరమణ అంశాన్ని పుతిన్ కావాలనే సాగదీస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు వాషింగ్టన్ మధ్య వర్తిత్వాన్ని మాస్కో తలకిందులు చేస్తోందని మండిపడ్డారు.
Also Read: Mangalavaaram: ఇది అస్సలు ఊహించలేదు.. 'మంగళవారం' సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరంటే!
‘ఉక్రెయిన్ తో యుద్ధం ముగించాలని రష్యా కోరుకుంటోంది. కానీ కాల్పుల విరమణ ఒప్పందం సాగదీస్తూ తమ కాళ్లను వారే లాక్కుంటున్నారు. అమెరికా మధ్యవర్తిత్వాన్ని పుతిన్ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ నేను ఈ మారణహోమాన్ని ఆపాలనుకుంటున్నా. కీవ్‌కు ఆర్థిక సాయం ఆపేయాలనుకుంటున్నాం' అని ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు.
poland | russia | putin | telugu-news | today telugu news