/rtv/media/media_files/2025/03/30/zmeOGVSg58doS7LkImmp.jpg)
mynmar death toll
శుక్రవారం, శనివారం వరుసగా రెండు రోజులు మయన్మార్ లో భూమి కంపించింది. రెక్టార్ స్కేల్ మీద 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం వలన మయన్మార్ లో భారీగా ఆస్తి నష్టం జరిగింది. చాలా ఇళ్ళు, భవనాలు కుప్పకూలాయి. భారీ భూకంపంలో మృతి చెందినవారి సంఖ్య 1,644కు పెరిగిందని మిలిటరీ ప్రభుత్వం నిన్న ప్రకటించింది. ఆ సంఖ్య ఇవాల్టికి మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఇక గాయపడ్డవారు దాదాపు 3,408 మంది దాకా ఉంటుందని తెలుస్తోంది. మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉందని యూఎస్ జియలాజికల్ సర్వే చెబుతోంది.
దారుణమైన స్థితిలో..
మయన్మార్ లో ప్రస్తుతం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చాలా ఇళ్ళు, భవనాలు కుప్ప కూలిపోయాయి. అక్కడి అతి పెద్ద నగరమైన మాండలేలో అత్యధికంగా ఆస్తి నష్టం జరిగింది. భవనాలు, బ్రిడ్జిలు కూలిపోయి జనాలు రోడ్డున పడ్డారు. చాలాచోట్ల రోడ్లు రెండుగా చీలిపోయాయి. శుక్రవారం వచ్చిన భూకంపమే తీవ్రమైనది అంటే శనివారం మళ్ళీ 5.1 తీవ్రతతో మళ్ళీ భూమి కంపించింది. మయన్మార్ నుంచి ఇండియాకూ ప్రకంపనలు వ్యాపించాయి. ఈశాన్య భారత్ లోని మణిపూర్, మేఘాలయతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ రిక్టర్ స్కేల్ పై 3.8 తీవ్రతతో భూమి కంపించింది. బంగ్లాదేశ్ లోని ఢాకా, ఛట్టోగ్రామ్ తో పాటు అటు చైనాలోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. మయన్మార్ కు భారత్ ఇప్పటికే సహాయం పంపించింది. అలాగే చైనా, రష్యా, సౌత్ కొరియా, అమెరికా దేశాలు కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చాయి.
Watch: M7.9 #earthquake strikes #Myanmar pic.twitter.com/7YVH28dXre
— CGTN (@CGTNOfficial) March 28, 2025
❗️A NEW EARTHQUAKE HAS STRUCK MYANMAR
— Sputnik (@SputnikInt) March 29, 2025
Tremors with a magnitude of 5.1 were recorded near the capital, Naypyidaw, according to seismologists. https://t.co/FUqDQWi3iD pic.twitter.com/H9wQ93hGEw
Heartbreaking Visuals of Myanmar Earthquake 💔
— The Viral Videos (@The_viralvideo_) March 29, 2025
You can feel the situation!#MyanmarEarthquake #Myanmarquake pic.twitter.com/MlaYVTyNnl
Photo shows the aftermath of the Mahamuni Pagoda in Mandalay, Myanmar from powerful earthquake. pic.twitter.com/7hpKMkJQm7
— AZ Intel (@AZ_Intel_) March 28, 2025
today-latest-news-in-telugu | earth-quake | death | toll
Also Read: SRH: బాబోయ్ హైదరాబాద్ లో ఉండలేం..సన్ రైజర్స్ గగ్గోలు