/rtv/media/media_files/2025/04/01/4NtwtEWJiM2TME5Fpxhd.jpg)
Myanmar
మయన్మార్ లో శవాల వెలికితీత ఇంకా సాగుతూనే ఉంది. ఐదు రోజులు గడిచినా ఇంకా మృతకళేబరాలు బయటపడుతూనే ఉన్నాయి. మరణించిన వారి సంఖ్య ఇప్పటికి 2 వేలు దాటిందని చెబుతున్నారు. ఇందులో దాదాపు 700 మంది ప్రార్థనలు చేస్తుండగా చనిపోయరాని చెబుతున్నారు. మయన్మార్ లో దాదాపు 60 మసీదులు కూలిపోవడమో, దెబ్బతినడమో జరిగిందని, వీటిలో చాలావరకు పురాతనమైనవని ముస్లిం సంఘాల ప్రతినిధి తున్ క్యీ చెప్పారు. అలాగే అక్కడ బౌద్ధమఠాలు కూడా కప్పకూలిపోయాయి. ఒక మఠంలో 200 మంది బౌద్ధ సన్యాసులు, మరో 50 మంది చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మాండలేలో మతపరమైన పరీక్షను రాస్తున్న 270 మందిలో 50 మంది ప్రాణాలు కోల్పోగా 70 మంది సురక్షితంగా బయటపడ్డారు. మిగిలినవారి ఆచూకీ గల్లంతయింది.
Apocalyptic scenes from Mandalay, MM. Only seeing small snippets of what is happening, given minimal internet or electricity. Supplies of food and water running scarce. Lack of machinery or govt support to find people under buildings.#WhatsHappeningInMyanmar #MyanmarEarthquake pic.twitter.com/xhLhYlKKRh
— Thu Thu Aung (@thuttag) March 30, 2025
Atouching moment during the tragedy:
— China in Pictures (@tongbingxue) March 28, 2025
The earthquake in Myanmar was felt in Ruili, Yunnan, China, where two nurses at Jingcheng Hospital's maternity center were seen shielding infants: pic.twitter.com/xDNqPAb9tt
Also Read: NASA: మీడియా ముందుకు సునీతా విలియమ్స్..మళ్ళీ ఐఎస్ఎస్ కు వెళ్తా..
చాలా మంది ఆచూకీ లభించలేదు..
మయన్మార్ భూకంపంలో చాలా మంది ఆచూకీ ఇప్పటి వరకు తెలియలేదు. ఒకవైపు ప్రాణాలు పోయి శవాలు బయటపడుతున్నాయి. మరోవైపు క్షతగాత్రుల సంఖ్య కూడా 3, 400 కు చేరుకుంది. వీరందరూ శిథిలాలు మీద పడి తీవ్రంగా గాయపడిన వారే. ఇంకోవైపు దాదాపు 300మంది దాకా ఆచూకీ లభ్యం కాలేదు. వారి కోసం ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. మయన్మార్ ప్రభుత్వం అంచనా వేసినదానికంటే ఎక్కువే ప్రాణ నష్టం జరిగి ఉంటుందని అంటున్నారు. మనుషుల గురించి వెతుకులాట అయ్యాక మయన్మార్ మొత్తం క్లీన్ చేయాల్సి ఉంటుంది. ఒక్క మాండలే నగరాన్ని క్లియర్ చేయడానికే చాలా రోజులు పట్టేట్టు వుందని అధికారులు చెబుతున్నారు. ప్రపంచ దేశాల నుంచి వెళ్ళిన సహాయక బృందాలు తమ వంతు సహాయం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వెళ్ళిన ఎన్డీఆర్ఎఫ్ బృందం ఇప్పటి వరకు ఏడు మృతదేహాలు వెలికి తీసింది. మొత్తం 13 భవనాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.
Aftermath #MyanmarEarthquake, the death toll has now risen to 2,056, with more than 3,400 injured. Several people are still under rubble.
— CRPH Myanmar (@CrphMyanmar) March 31, 2025
Most of effected people haven't received shelter, medical care and enough food.
Help Myanmar's people NOW.
↪️ https://t.co/qEKaGUvX9X pic.twitter.com/OqHCm14eQr
#WATCH: Videos show how a heart diseased 75-year-old grandmother and her 16- and 13-year-old grandchildren stayed strong for over 15 hours in the rubble of a #Mandalay condo that had collapsed during the #MyanmarEarthquake. The children's father told me he wanted to spread the… pic.twitter.com/DgnkTbqSBL
— Cape Diamond (@cape_diamond) March 30, 2025
Terrifying CCTV video of yesterdays M7.7 earthquake that hit Myanmar. The death toll is at least 1,644, with 3,408 people injured. Numbers are expected to rise. pic.twitter.com/5fAXXXpVDl
— Volcaholic 🌋 (@volcaholic1) March 29, 2025
today-latest-news-in-telugu | earth-quake | death | toll