France: మస్క్‌ తీరు ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పే..ఫ్రాన్స్‌ ప్రధాని!

ప్రపంచ నేతలతో అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు విభేదాలు పెరుగుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌ ప్రధాని ఫ్రాంకోయిస్‌ బేరో మస్క్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.మస్క్‌ తీరు ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఆయన పేర్కొన్నారు.

New Update
french

french

ప్రపంచ నేతలతో అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ కు విభేదాలు పెరుగుతున్నాయి. తాజాగా ఫ్రాన్స్‌ ప్రధాని ఫ్రాంకోయిస్‌ బేరో మస్క్‌ పై తీవ్ర విమర్శలు చేశారు.మస్క్‌ తీరు ప్రజాస్వామ్యానికి ముప్పుగా ఆయన పేర్కొన్నారు. ఎలాన్‌ మస్క్‌ ప్రజాస్వామ్యానికి ముప్పు సృష్టిస్తున్నాడు.

Also Read: 

మనస్సాక్షిని పాలించే హక్కు డబ్బుకు ఇవ్వకూడదు అని బేరో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.మస్క్‌ ఇటీవల ఫ్రాన్స్‌, యూరప్‌ లను ఉద్దేశిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధానాలకు ఆయా దేశాలు దాసోహం కావాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. కుదరని పక్షంలో ఆధిపత్యం, అణచివేత, అట్టడుగు స్థాయిని ఎదుర్కోవాల్సి వస్తోందంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌ ప్రధాని తాజాగా స్పందించారు.

Also Read: Davos: పెట్టుబడులు, చర్చలు ఒకవైపు...శృంగారం మరోవైపు..దావోస్ లో పారిశ్రామిక వేత్తల భాగోతం

కొన్ని నెలల నుంచి మస్క్‌ కు, ప్రపంచ నేతలకు మధ్య వివాదాలు ఏర్పడుతున్న సంగతి తెలిసిందే. జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌  షోల్జ్‌ , కెనడా ప్రధాని ట్రూడో, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ వంటి వారితో మాటల యుద్ధాలకు దిగిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో మస్క్‌ బ్రిటన్‌ రాజకీయాల గురించి ఎక్కువగా జోక్యం చేసుకుంటున్నారు.

Also Read: America: కాళ్లూ, చేతులు కట్టేసి.. నీళ్లు కూడా ఇవ్వకుండా.. అక్రమవలసదారుపై అమెరికా వికృత చేష్టలు!

అక్కడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ..విపక్షం రీఫామ్‌ యూకేకు మద్దతు తెలుపుతున్నారు.మరోవైపు తమ దేశ ఎన్నికల్లో టెస్లా అధినేత నేరుగా జోక్యం చేసుకొంటున్నాడని ఫ్రాన్స్‌ అధినేత మెక్రాన్‌,కెనడా ప్రధాని ట్రూడో, యూకే పీఎం స్టార్మర్‌ , నార్వే ప్రధాని జోనాస్‌ ఆరోపించారు.

అంతేకాక..యూకేలోని గ్రూమింగ్‌ గ్యాంగ్స్‌ అరాచకాలపై సైతం వరుస ప్రకటనలు చేశారు. డైరెక్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ హోదాలో ఉన్నవేళ స్టార్మర్‌ వాటిని అదుపు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఈ ఆరోపణలను యూకే పీఎం స్టార్మర్‌ తిరస్కరించారు. మస్క్‌పేరు ప్రస్తావించకుండా..అబద్ధాలు, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్నారు.

అత్యాచారాలకు గురైన చిన్నారులకు న్యాయం చేయడానికి తాము ఎప్పుడు కట్టుబడి ఉంటామని ఆయన అన్నారు.

Also Read: California Wild Fire: కాలిఫోర్నియా వాసులకు ఓ గుడ్ న్యూస్.. మరో షాకింగ్ న్యూస్..!

Also Read: Telangana: సరస్వతి పుష్కరాలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి.. ఎప్పుడు, ఎక్కడ..అంటే

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: కశ్మీర్ సమస్యపై స్పందించిన ట్రంప్

భారత్ పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు.నేను ఆ రెండు దేశాలకూ మంచి స్నేహితుడునే.కశ్మీర్‌ సమస్య వెయ్యేళ్లుగా అలాగే ఉంది.ఆ రెండు దేశాలే దాన్ని ఎలాగోలా పరిష్కరించుకుంటాయని అన్నారు

New Update
Donald Trump

Donald Trump

భారత్ పాక్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ స్పందించారు.నేను ఆ రెండు దేశాలకూ మంచి స్నేహితుడునే.కశ్మీర్‌ సమస్య వెయ్యేళ్లుగా అలాగే ఉంది.ఆ రెండు దేశాలే దాన్ని ఎలాగోలా పరిష్కరించుకుంటాయి.ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న మాట నిజమే.కానీ అవి ఎప్పుడూ ఉన్నాయిగా అని వ్యాఖ్యానించారు.కాగా..పాక్‌ ఏర్పడింది.1947 లో అని కూడా ట్రంప్‌ కు తెలీదా అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టి విమర్శిస్తున్నారు.

Also Read: BIG BREAKING: హైదరాబాద్ పోలీసుల అదుపులో పాకిస్తానీయుడు.. యువతిని పెళ్లి చేసుకుని

ఇదిలా ఉంటే..జమ్మూ కశ్మీర్‌ లోని పహల్గం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత ప్రధాని మోడీతో ఫోన్‌ లో మాట్లాడారు. ఉగ్రదాడిని ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.ప్రధాని మోడీ కి ట్రంప్‌ ఫోన్‌ చేసిన విషయాన్ని విదేశీ వ్యవహరాల శాఖ అధికార ప్రతినిధి  జైస్వాల్‌ సోషల్‌ మీడియాలో తెలియజేశారు. '' ప్రధాని మోడీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు.

Also Read: Realme 14T 5G: రియల్‌మి నుంచి బ్లాక్ బస్టర్ స్మార్ట్‌ఫోన్.. సేల్ షురూ - ధర, ఆఫర్ల వివరాలివే!

ఉగ్రదాడిలో బలైన వారికి ట్రంప్‌  సంతాపం తెలియజేశారు. ఉగ్ర దాడి ఘటనను ట్రంప్‌ తీవ్రంగా ఖండించారని జైస్వాల్‌ పేర్కొన్నారు.ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని చట్టం ముందుకు తీసుకురావడానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని ట్రంప్‌ అన్నారు. ఉగ్రవాద పోరులో అమెరికా, భారత్‌ ఒకరికొకరు కలిసి పోరాడతాయని ఎక్స్‌ లో రణధీర్‌ జైస్వాల్‌ తెలిపారు.

ట్రంప్ ఫోన్ చేసి మద్ధతుగా మాట్లాడడంతో ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టడానికి భారత్‌ కృత నిశ్చయంతో ఉన్నట్లు మోడీ పేర్కొన్నారు. అంతకు ముందే ఇదే విషయమై ట్రంప్‌ తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. కశ్మీర్‌ ఉగ్ర ఘటన తనను కలచివేసిందని పేర్కొన్నారు,.

మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన మోడీకి, భారతప్రజలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

Also Read:AP Govt : ఏపీ ప్రభుత్వం కొత్త పథకం.. కుటుంబానికి రూ.20వేలు..రేపటి నుంచి అకౌంట్లోకి!

Also Read: Himachal Pradesh Accident : పెళ్లింట తీవ్ర విషాదం.. కారు లోయలో పడి ఐదుగురి మృతి

trump | kashmir | Jammu and Kashmir | india | latest-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment