/rtv/media/media_files/2026/03/30/mojtaba-khamenei-2026-03-30-11-18-27.jpg)
Mojtaba Khamenei
పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్(iran war) కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ(Mojtaba) మరో కీలక సందేశాన్ని విడుదల చేశారు. ఈ యుద్ధంలో ఇరాన్‌కు అండగా నిలుస్తున్న ఇరాక్ ప్రజలకు, అక్కడి మత పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించిన తర్వాత, ఆయన రెండో కొడుకు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ పదవిలోకి ఆయన వచ్చిన్పపటి నుంచి ఇప్పటిదాకా ఆయన ఎక్కడా కూడా బహిరంగంగా కనిపించలేదు. ఆయన ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా అనేక ఊహాగానాలు వచ్చాయి.
Also Read: ఇరాన్ చమురును తీసుకోవడం నాకు ఇష్టం.. ఖార్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్
Mojtaba's New Message
మొజ్తబా ఖమేనీ చనిపోయాడని ఇజ్రాయెల్ చెబుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మొజ్తబా చనిపోయి ఉండొచ్చు లేదా తీవ్రంగా గాయపడి ఉండొచ్చని అన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మొజ్తబా మరో సందేశాన్ని విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్ మీడియా వెల్లడించిన కథనం ప్రకారం.. ఇరాక్‌లోని ప్రముఖ షియా మత గురువు గ్రాండ్ అయతుల్లా అలీ సిస్తానీ, ఇరాక్ ప్రజలు ఇరాన్‌పై జరుగుతున్న దాడులను ఖండించినందుకు మొజ్తబా కృతజ్ఞతలు తెలియజేశారు. బాగ్దాద్‌లోని ఇరాన్ రాయబారి, ఇరాక్ ఇస్లామిక్ సుప్రీం కౌన్సిల్ సభ్యుల మధ్య జరిగిన మీటింగ్‌లో ఈ సందేశాన్ని అందించారు. అయితే దీన్ని ఏ రూపంలో పంపించారనే దానిపై క్లారిటీ లేదు. ఈ యుద్ధంలో ఇరాన్ తప్పకుండా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: అమెరికాను తీవ్రంగా దెబ్బకొట్టిన ఇరాన్.. శత్రువుల రాకను పసిగట్టే అవాక్స్ విమానం ధ్వంసం
ఇదిలాఉండగా మొజ్తబా బాధ్యతలు చేపట్టాక పర్షియన్ కొత్త సంవత్సరం 'నౌరూజ్' సందర్భంగా కూడా ఓ సందేశాన్ని రిలీజ్ చేశారు. ఈ సందేశాన్ని టీవీ ప్రతినిధుల ద్వారా చదివి వినిపించారు. కానీ ఖమేనీ నేరుగా కెమెరా ముందుకు రాలేదు. వైమానిక దాడుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారని.. ప్రస్తుతం కోలుకుంటున్నారని ఇరాన్ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు సంబంధించిన పాత ఫొటోలు, సోషల్ మీడియా ఖాతాలను ప్రభుత్వం వాడుతున్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితిపై సరైన ఆధారాలు లేకపోవడం చర్చనీయమవుతోంది.
Follow Us