/rtv/media/media_files/2025/02/12/5JITAstPNi2aHQ2XGYKQ.jpg)
modi in france Photograph: (modi in france)
ప్రధాని మోదీ (PM Modi) ఫ్రాన్స్ పర్యటన (France Tour) లో మూడవ రోజు బుధవారం చివరిది. ఆయన ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో కలిసి మార్సెయిల్‌లోని మజార్గ్స్ స్మశానవాటికను సందర్శించారు. ప్రపంచ యుద్ధంలో పోరాడి ప్రాణాలర్పించిన భారతీయ సైనికులకు అక్కడే దహన సంస్కారాలు చేశారు. మార్సెయిల్‌లోని మజార్గ్స్ స్మశానవాటికలో భారతీయ సైనికులకు నివాళులర్పించారు. స్వాతంత్య్ర సమరయోధుడు వీర్ సావర్కర్ మార్సెయిల్‌లోనే బ్రిటిష్ వారికి పట్టుపడ్డారని మోదీ గుర్తు చేశారు.
Modi Recalled The Memories Of France
Au cimetière militaire de Mazargues, le Président @EmmanuelMacron et moi avons rendu hommage aux soldats qui ont combattu lors des Guerres mondiales. Parmi eux, plusieurs soldats indiens qui se sont battus vaillamment et ont fait preuve d'une détermination sans faille.
— Narendra Modi (@narendramodi) February 12, 2025
Tous… pic.twitter.com/IuQGJPaOP2
ఇది కూడా చదవండి: Lavanya: షాకింగ్ న్యూస్.. పోలీస్ బాస్‌తో లావణ్య రాసలీలలు.. వీడియో వైరల్!
మోదీ తన ఎక్స్ అకౌంట్‌లో ఫ్రాన్స్ గొప్పతనం గురించి పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఈ నగరం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. వీర్ సావర్కర్ ఇక్కడే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. ఆయనను బ్రిటిష్ కస్టడీకి అప్పగించవద్దని డిమాండ్ చేసిన మార్సెయిల్ ప్రజలకు, ఆనాటి ఫ్రెంచ్ కార్యకర్తలకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వీర్ సావర్కర్ ధైర్యం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉందని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: ఆరోగ్యం సహకరించకున్నా ఆలయాల సందర్శన.. కారణం అదే.. పవన్ కీలక ప్రకటన!
A historic moment in Marseille!
— Narendra Modi (@narendramodi) February 12, 2025
President @EmmanuelMacron and I inaugurated the Indian Consulate in this vibrant city, marking a new chapter in India-France ties. This consulate will serve as an important bridge, strengthening our cultural, economic and people-to-people… pic.twitter.com/xXRH13mzON
Also Read : 106 కి.మీ.. ఉరి వేసుకోబోతున్న యువకుడిని ఏపీ పోలీసులు ఎలా కాపాడారంటే!
మార్సెయిల్‌లోని ఒక హోటల్‌లో భారత ప్రవాసుల నుండి ప్రధాన మంత్రి మోడీకి ఘన స్వాగతం పలికారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్‌తో కలిసి మోదీ మార్సెయిల్‌లో భారత కాన్సులేట్‌ను ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతామని ఆయన అన్నారు. మార్సెయిల్‌లో మోదీకి ఇండియన్స్ ఘనంగా స్వాగతం పలికారు. అమెరికాలో మోదీ రెండు రోజులు పర్యటించనున్నారు. భారత్ ప్రధాని ఫ్రాన్స్ పర్యటనలో ఇరు దేశాల మధ్య అనేక ఒప్పందాలు జరిగాయి. అంతర్జాతీయ థర్మోన్యూక్లియర్ ఎక్స్‌పెరిమెంటల్ రియాక్టర్ (ITER) ప్రాజెక్టులో 10 శాతం వాటా భారత్‌కు కేటాయించింది. అందుకుగాను ఫ్రాన్స్‌కు ఇండియా రూ.17,500 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ఫ్రాన్స్ నుంచి మోదీ బుధవారం సాయంత్రం నేరుగా అమెరికా బయలుదేరనున్నారు. రెండు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు.
Also Read : రాత్రి పూట మటన్ తింటే డేంజర్! ఈ విషయాలు తెలుసుకోండి