Bill Gates: కమలాహారిస్‌కు బిల్‌గేట్స్ భారీ విరాళం.. ఎందుకంటే? మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కు భారీవిరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. కమలాహారిస్‌కి మద్దతు ఇచ్చే ఎన్జీవోకి 50 మిలియన్ల డాలర్లు అనగా రూ.420 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. By Kusuma 23 Oct 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు మరో రెండు వారాల్లో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కమలాహారిస్, ట్రంప్ పోటీపడుతున్నారు. మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మద్దతు వీరిద్దరిలో ఎవరికనే చర్చ జోరుగా సాగింది. బిల్‌గేట్స్ కూడా తన మద్దతు ఎవరికి ఇస్తున్నారో బహిరంగంగా ప్రకటించలేదు. ఇది కూడా చూడండి: ఐదేళ్లుగా నకిలీ కోర్టు.. గుట్టు రట్టు చేసిన పోలీసులు.. ఎక్కడంటే? కోట్ల భారీ విరాళం.. ఇదిలా ఉండగా బిల్‌గేట్స్ కమలాహారిస్‌కు భారీ విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. కమలాహారిస్‌కు మద్దతిస్తున్న ఫ్యూచర్ ఫార్వర్డ్ ఎన్జీవో సంస్థకు 50 మిలియన్ల డాలర్లు అనగా రూ.420 కోట్లు విరాళంగా ఇచ్చారని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఎలాగైన కమలాహారిస్ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా చూడండి: కళ్లు చెదిరే డ్రోన్ షో.. 5 గిన్నిస్ రికార్డులు సొంతం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమాలాహారిస్ ఈసారి బరిలో ఉన్నారు. అయితే బిల్‌గేట్స్ ఎవరికి మద్దతు ఇస్తారని ఇప్పటికీ బహిరంగంగా తెలపలేదు. ఈ భారీ విరాళంతో తన మద్దతు కమలాహారిస్‌కి అని అర్థం అవుతోంది. ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించడంతో బిల్‌గేట్స్ మద్దతు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌కి అని స్పష్టంగా తెలుస్తోంది. ఇది కూడా చూడండి: హ్యాపీ బర్త్‌డే డార్లింగ్.. నెట్టింట దుమ్ము లేపుతున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఇటీవల బిల్‌గేట్స్ ఓ ఇంటర్వూలో ఎన్నికల కోసం మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణను మెరుగుపరుస్తూ, పేదరికాన్ని తగ్గించేందుకు ప్రయత్నించిన వారికి మద్దతు ఇస్తానని తెలిపారు. ఎంతో మంది రాజకీయ నాయకులతో పనిచేసిన అనుభవం తనకి ఉందన్నారు. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ అధ్యక్ష రేసు నుంచి వైదొలగడంతోనే కమలాహారిస్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపారు. ఇతని మాజీ భార్య మెలిండా ఫ్రెంచ్ గేట్స్ కమలాహారిస్‌కు మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. ఇది కూడా చూడండి: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. లక్షల కోట్లు గోవిందా! #donald-trump #microsoft #america-elections #billgates #kamala-haaris మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి