/rtv/media/media_files/2025/03/10/awlE8ej7B48kjMgtze4w.jpg)
mark
కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తరువాత ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. ప్రధాని పదవి నుంచి వైదొలుగుతున్నట్లు జస్టిన్ ట్రూడో ఈ జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో లిబరల్ పార్టీ నూతన సారథి ఎన్నిక తప్పనిసరి అయ్యింది.
Also Read: BIG BREAKING: సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం
ఇందులో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగా నిలిచారు.59 సంవత్సరాల కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ ను ఓడించి పార్టీ నూతన సారథిగా ఎన్నికయ్యారు. దీంతో తొమ్మిది సంవత్సరాల పాటు సాగిన ట్రూడో పాలనకు తెరపడింది.
Also Read: NZ VS IND: జియో హాట్‌స్టార్ రికార్డ్.. భారత్ సెకండ్ ఇన్నింగ్స్‌లో 84 కోట్లకు చేరిన వ్యూస్
మొత్తం 150,000 పార్టీ సభ్యులు ఓటింగ్ లో పాల్గొన్నారు. కార్నేకు 131,674 ఓట్లు వచ్చాయి. ఇవి 85.9 శాతంతో సమానం.రెండోస్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ 11,134 ,కరినా గౌల్డ్ కు 4,785 ,ఫ్రాంక్ బేలిస్ కు 4,038 ఓట్లు వచ్చాయి.
ట్రంప్ నుంచి సుంకాల ముప్ప వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వెళ కార్నీ 24 వ ప్రధానిగా కెనడా పాలన పగ్గాలు చేపట్టనున్నారు.
అసలు ఎవరీ కార్నీ...
మార్క్ కార్నీ 1965లో ఫోర్ట్ స్మిత్ లో జన్మించారు. హార్వర్డ్ లో ఉన్నత విద్య అభ్యసించారు.గోల్డ్‌మన్ శాక్స్ లో 13ఏళ్లు పని చేసిన ఆయన..2003 లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్ గా ఎన్నికయ్యారు. 2004 లో ఆ బాధ్యతల నుంచి వైదొలిగి..ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు.ఆ తరువాత 2008 ఫిబ్రవరి 1న సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ గా నియమితులయ్యారు.
2008-09 ఆర్థిక సంక్షోభం వేళ ..పరిష్కార మార్గాల్లో ముఖ్య పాత్ర పోషించారు. వడ్డీ రేట్లను సున్నాకు తగ్గించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి అవసరమైన చర్యలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
2013లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ గా ఎన్నికైన కార్నీ...మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ సెంట్రల్ బ్యాంక్ కు మొట్టమొదటి నాన్ బ్రిటీష్ గవర్నర్ గా నిలిచారు.అంతేకాదు, జీ 7లోని రెండు సెంట్రల్‌బ్యాంకులకు నాయకత్వం వహించిన వ్యక్తిగానూ రికార్డులు సృష్టించారు.
2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ను వీడిన ఆయన..ఐరాస ఆర్ధిక , వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు. ట్రూడో రాజీనామా ప్రకటన అనంతరం..లిబరల్స్ లో ప్రధాని రేసులో ఉన్న నలుగురు అభ్యర్థుల్లో అత్యధిక ఆదరణ పొందారు.దీంతో పాటుఎక్కువ విరాళాలు సేకరించిన అభ్యర్థిగా నిలిచారు.ఎన్నడూ ఎన్నికల్లో పోటీచేయని, కేబినెట్ లో పని చేసిన అనుభవం లేని కార్నీ..కెనడా తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
Also Read: NZ VS IND: 37 ఓవర్లు కంప్లీట్.. గెలుపుకు దగ్గరలో భారత్- స్కోర్ ఎంతంటే?