Dubai Port: కువైట్‌కు మరో ఎదురుదెబ్బ.. చమురు ట్యాంకర్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్‌కు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై భీకర దాడులు చేసింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి.

New Update
Kuwaiti oil tanker hit in Dubai port

Kuwaiti oil tanker hit in Dubai port

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. తాజాగా కువైట్‌కు చెందిన ఓ చమురు ట్యాంకర్‌పై భీకర దాడులు చేసింది. ఈ ఘటనలో భారీగా మంటలు చెలరేగాయి. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అల్ సల్మీ అనే భారీ ముడిచమురు నౌక దుబాయ్ పోర్టు(Dubai Port) వద్ద ఉంది. దీనిపై ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. వీటిని అదుపులోకి తీసుకొచ్చేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

Also Read: రేపటి నుంచే జనగణన ప్రారంభం.. 33 ప్రశ్నలతో సమాచార సేకరణ

Kuwaiti Oil Tanker Hit In Dubai Port

ప్రమాద తీవ్రత ఎక్కువగానే ఉన్నప్పటికీ 24 మంది సిబ్బంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దాడి జరిగిన సమయంలో ట్యాంకర్ నిండా చమురు ఉన్నట్లు సమాచారం. అది సముద్రంలో పడిపోయే ముప్పు ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. దుబాయ్ అధికారులు కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. రెస్క్యూ బృందం మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. 

Also Read: ట్రంప్ '15 సూత్రాల' ప్లాన్‌కు ఇరాన్ నో.. యుద్ధంలో సొరచేపలకు అమెరికా సైన్యం ఆహారమే!

Advertisment
తాజా కథనాలు