/rtv/media/media_files/2026/02/03/respond-2026-02-03-17-02-14.jpg)
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం చుట్టూ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయం ముదిరింది. భారత్ ఇకపై రష్యా నుండి చమురు(Donald Trump Russian oil on India) కొనదు అని ట్రంప్ చేసిన ప్రకటనపై రష్యా ప్రభుత్వం స్పందించింది. ఈ విషయంలో తమకు భారత్ నుండి ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేసింది.
The Kremlin has dismissed US President Donald Trump’s claim that India will stop buying Russian oil, saying Moscow has received no such indication from New Delhi and energy cooperation continues as usual. #IndiaRussia#RussianOil#IndiaUSTradeDeal#Geopolitics#EnergySecuritypic.twitter.com/I2XjdGyPwk
— The Daily Jagran (@TheDailyJagran) February 3, 2026
Also Read : అమెరికాలో గ్రీన్ కార్డ్ హోల్డర్లకు ట్రంప్ బిగ్ షాక్!
ఎటువంటి అధికారిక ప్రకటన అందలేదు
రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. "చమురు కొనుగోళ్లు ఆపేస్తున్నట్లు ఇప్పటివరకు మాకు న్యూఢిల్లీ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన అందలేదు" అని తేల్చి చెప్పారు. ట్రంప్ ప్రకటన కేవలం ఆయన వైపు నుండే వచ్చిందని రష్యా అభిప్రాయపడింది.
అమెరికా-భారత్ మధ్య కుదిరిన సంబంధాలను తాము గౌరవిస్తామని చెబుతూనే, రష్యా-భారత్ మధ్య ఉన్న వ్యూహాత్మక బంధం తమకు ఎంతో ముఖ్యమని పెస్కోవ్ పేర్కొన్నారు. "భారత్‌తో మాకున్న స్నేహం చాలా విలువైంది. దీనిని మరింత బలోపేతం చేసుకునేందుకే మేము ప్రయత్నిస్తాము" అని ఆయన స్పష్టం చేశారు.
అమెరికా విధిస్తున్న సుంకాలను 50% నుండి 18%కి తగ్గించడాన్ని ప్రధాని మోదీ(PM Modi) స్వాగతించారు. 'మేడ్ ఇన్ ఇండియా' ఉత్పత్తులకు ఇది పెద్ద ఊరట అని ఆయన పేర్కొన్నారు. అయితే, రష్యా చమురును ఆపేస్తామన్న విషయంపై భారత్ ఇప్పటివరకు నోరు విప్పలేదు.
2022లో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుండి, తక్కువ ధరకే లభిస్తున్న రష్యా చమురును కొంటున్న అతిపెద్ద దేశం భారత్. ఈ విషయంలో వెస్ట్రన్ దేశాలు భారత్‌పై గతంలో ఒత్తిడి తెచ్చినా, భారత్ మాత్రం తన సొంత ప్రయోజనాలకే మొగ్గు చూపింది.
Also Read : మోదీ ప్లాన్ కు భయపడ్డ ట్రంప్.. అందుకే వెనక్కి తగ్గాడా?
Follow Us