/rtv/media/media_files/2025/02/28/iITF32468nptDG2Tz7TG.jpg)
USA Fedral Jobs
ట్రంప్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డోజ్ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటోంది. దీనికి అధ్యక్షుడు అయిన ఎలాన్ మస్క్ ఫెడరల్ ఉద్యోగుల వలన లాభం లేదు. వారి ఉద్యోగాలు తొలగిస్తే..ప్రభుత్వానికి బోలెడంత డబ్బులు ఉపయోగపడతాయని చెప్పగానే ట్రంప్ ఆ సూచనలను వెంటనే పాటించేశారు. ఫెడరల్ ఉద్యోగులను సగానికి సగం తగ్గించేయాలని ఆదేశాలను ఇచ్చేశారు. ట్రంప్ ఆదేశాలను ఆ సంస్థలు కూడా పాటించేశాయి. అయితే తాజాగా ట్రంప్ నిర్ణయానికి డిస్ట్రిక్ట్ జడ్జి విలియం అలప్స్ అడ్డుకట్ట వేశారు. అమెరికా అధ్యక్షుడి ఆదేశాలను నిలిపివేయాలని చెప్పారు. పర్సనల్ మేనేజ్‌మెంట్ కార్యాలయానికి అలాంటి అధికారాలు లేవని న్యాయమూర్తి స్పష్టంచేశారు. తొలగింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆదేశించారు. దీంతో ఫెడరల్ ఉద్యోగులకు కాస్త ఉపశమనం దొరికింది. తమ ఉద్యోగాలు పోయి రోడ్డు మీదకు వచ్చేస్తామనుకున్న వారు తృటిలో తప్పించుకున్నట్టు అయింది.
కన్నీళ్ళు పెట్టుకుంటున్న యూఎస్ ఎయిడ్ ఉద్యోగులు..
అమెరికా అధ్యక్షుడు రాగానే మొదట చేసిన పని యూఎస్ ఎయిడ్ ను పీకేయడం. దీంతో విదేశాలకు యూఎస్ ఎయిడ్ రూపంలో అందించే సాయానికి సంబంధించిన 90శాతం కాంట్రాక్టులను అమెరికా రద్దు చేసింది. దీని ద్వారా 60 బిలియన్ డాలర్లని సేవ్ చేస్తున్నామని ట్రంప్ యంత్రాంగం తెలిపింది. కోర్టు కేసుల్లో ఉన్న కొన్ని ప్రాజెక్టులు మాత్రం కొనసాగుతాయని ప్రభుత్వం చెప్పింది. దీంతో యూఎస్ ఎయిడ్ కు సంబంధించి వేల ఉద్యోగాలు పోయాయి. అంతకు ముందే వారందరినీ సెలవుపై పంపారు. ఇప్పుడు తాజాగా వారందరినీ వెనక్కు పిలిపించి మరీ 15 నిమిషాల్లో తమ డెస్క్ లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గురు, శుక్ర వారాల్లో వారంతా వచ్చి ఖాళీ చేయాలని సూచించింది. దీంతో గురువారం వందల మంది కార్యాలయానికి వచ్చి తమ సామగ్రి తీసుకుని వెళ్లిపోయారు. వారిలో కొందరు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటికే యూఎస్ ఎయిడ్ ప్రధాన కార్యాలయాన్ని ప్రభుత్వం మూసేసింది. దీంతో 6 దశాబ్దాల యూఎస్ ఎయిడ్ కార్యాలయం ఒక చరిత్రగా మిగిలిపోనుంది.
Also Read: TS: టీబీఎంను ముక్కలుగా కోస్తున్న రెస్క్యూ బృందం..కార్మికుల కోసం ఇంకా వెతుకులాట