/rtv/media/media_files/2024/11/15/wUiZpzv3HMK4DFbBA86U.jpg)
Jeff Bezos
అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్(60) మళ్లీ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన ప్రియురాలు అయిన లారెన్ శాంచెజ్‌తో 2023లో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వేసవిలో ఇటలీలోని వెనిస్‌లో ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటలీ తీరంలో 500 మిలియన డాలర్ల నౌకలో జూన్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: Delhi Railway station : ట్రైన్ల ఆలస్యంతో కిక్కిరిసిన ఢిల్లీ రైల్వే స్టేషన్!
Jeff Bezos and Lauren Sanchez to tie the knot this summer in Italy after a two-year engagement pic.twitter.com/iRUJwUSaUY
— Naija (@Naija_PR) March 23, 2025
ఇది కూడా చూడండి: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతిs
లగ్జరీ నౌకలో ప్రపోజ్..
ఇదిలా ఉండగా జెఫ్ బెజోస్ తన ప్రియురాలికి 2.5 మిలియన్ డాలర్లు అనగా దాదాపుగా 21 కోట్లు వజ్రాల ఉంగరంతో శాంచెజ్‌కు ఓ లగ్జరీ నౌకలో ప్రపోజ్ చేశారు. లారెన్ శాంచెజ్ జర్నలిస్ట్‌గా పనిచేసేవారు. ఎన్నో ఏళ్ల నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే శాంచెజ్ తన భర్తకు విడాకులు ఇవ్వకముందు నుంచే జెఫ్ బెజోస్, ఈమె డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
ఇది కూడా చూడండి: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్
జెఫ్ బెజోస్, లారెన్ 2018 నుంచి డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే 2019లో జెఫ్ బెజోస్ తన భార్య మెకంజీ స్కాట్‌కి విడాకులు ఇచ్చారు. విడాకుల మందు నుంచే లారెన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ విడాకుల తర్వాత వీరి రిలేషన్‌ను జెఫ్ బెజోస్ బయటపెట్టారు. ది వ్యూ, కేటీ టీవీ, ఫాక్స్ 11 వంటి ప్రముఖ ఛానెల్స్‌లో రిపోర్టర్‌గా, న్యూస్ యాంకర్‌గా లారెన్ గతంలో పనిచేశారు.