Japan: జపాన్‌ కనిపించకుండా పోనుందా..?

జపాన్ అభివృద్ధి చెందిన దేశం అయినా, నిత్యం భూకంపాలు, సునామీలతో సావాసం చేస్తుంటుంది.ఈ భూకంపాల వల్ల 2 లక్షల 98 వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఏకంగా 1.8 ట్రిలియన్ల ఆస్తి నష్టం కలగనున్నట్లు తెలుస్తుంది.

New Update
japan

japan

జపాన్ అభివృద్ధి చెందిన దేశం అయినా, నిత్యం భూకంపాలు, సునామీలతో సావాసం చేస్తుంటుంది. ఈ ద్వీపకల్ప దేశంలో నిత్యం ఎక్కడో ఒకచోట భూప్రకంపనలు చోటు చేసుకుంటాయి. అక్కడి ప్రజలు ఎప్పుడు ఎలాంటి ముప్పు పొంచి ఉందోననే భయంతో బతుకుతుంటారు. ఈ నేపథ్యంలో జపాన్ తాజా విపత్తు నివేదిక ప్రజలను, ప్రభుత్వాన్ని భయంలో ముంచింది. నాంకై ట్రఫ్ మెగా భూకంపం గురించి సంచలన విషయాలను వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఏకంగా 2 లక్షల 98 వేల మంది చనిపోయే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. 

Also Read: Russia: అప్పుడు చైనా...ఇప్పుడు రష్యాలో కొవిడ్‌ తరహా మిస్టరీ వైరస్‌...!

సుమారు కోటి 23 లక్షల మంది వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడ వచ్చని తేల్చిచెప్పింది. ఏకంగా 1.8 ట్రిలియన్ల ఆస్తి నష్టం కలిగించే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది. అతి తీవ్రమైన ఈ భూకంపాన్ని ఎదుర్కొనేందుకు జపాన్ సిద్ధంగా లేదని తేల్చింది. ప్రభుత్వం ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. అయితే, ఈ భూకంపం ఎప్పుడు రాబోతుంది? అనే విషయాన్ని మాత్రం నివేదిక వెల్లడించలేదు.

Also Read: Musk: 13వ సంతానంపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో!

గత ఏడాది జనవరిలో జపాన్‌లో  భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9 గా నమోదైంది. క్యుషు ద్వీపంలోని మియాజాకి ప్రాంతంలో 37 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు అధికారులు. దీని ప్రభావంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా, ఆస్తి నష్టం జరిగింది.  నిత్యం భూప్రకంపనలతో ప్రజలకు ప్రశాంతమైన నిద్ర కరువైంది.జపాన్ ద్వీపకల్పం కావడంతో చుట్టూ సముద్ర జలాలు ఉంటాయి. సముద్రం, భూమి మధ్య ఏర్పడిన సంఘర్షణతో ఇలాంటి భూకంపాలు చోటుచేసుకుంటాయని పరిశోధకులు చెప్తున్నారు. 

తరచుగా భూప్రకంపనలు అనేవి కామన్ అన్నారు. అయితే, ఎప్పుడో ఒకసారి భూకంపాల తీవ్రత అధికంగా ఉంటుందని, అదే సమయంలో సునామీ ముప్పు పొంచి ఉందని చెప్తున్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించి నివసించాలని సూచిస్తున్నారు. ఇక 2011లో వచ్చిన భూకంపం జపాన్ చరిత్రలోనే అత్యంత తీవ్రమైనదిగా గుర్తింపు తెచ్చుకుంది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై ఏకంగా 9.0గా రికార్డు అయ్యింది. పెద్దమొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.

ఇక జపాన్ ప్రభుత్వం భూకంపాల నుంచి రక్షణ కోసం అనేక చర్యలు తీసుకుంటుంది. ఎప్పటికప్పుడు భూకంపాల ముందస్తు హెచ్చరికలు, సునామీ హెచ్చరికలు చేస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నది.  జపాన్ భూకంప పరిశోధన కమిటీ రాబోయే 30 సంవత్సరాలలో నాంకై ట్రఫ్ మెగా భూకంపం సంభవించే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీని తీవ్రం ఊహకు అందని రీతిలో ఉంటుందని వెల్లడించింది. 

ఈ నేపథ్యంలో జపాన్.. దేశ ప్రజలకు భూకంపాల గురించి అవగాహన కల్పించడంతో పాటు, భూకంపాల సమయంలో ఎలా వ్యవహరించాలనే అంశంపై శిక్షణ ఇస్తున్నారు. ఊహకు మించి విపత్తులు సంభవిస్తే, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశంపై ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు తగిన ఏర్పాటు చేసుకుంటున్నది. విపత్తు ఏ స్థాయిలో ఉన్నా ఎదుర్కొనేందుకు రెడీ ఉంటుంది.

Also Read: Musk-Tesla Cars: టెస్లా షోరూంలో అగ్ని ప్రమాదం... 17 కార్లు దగ్ధం..వారి చర్యే అంటున్న మస్క్‌!

Also Read: Trump-America:ఈ సారి ట్రంప్‌ కొరడా ఆరోగ్య శాఖ పై..వేల సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు!

 

 japan | earthquake | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: ఆఫ్రికన్లకు ట్రంప్ షాక్.. వీసాలు రద్దు

ఇటీవల అమెరికాకు వచ్చిన ఆఫ్రికన్ పౌరులను ట్రంప్ సర్కార్ తమ దేశాలకు తిరిగి పంపించింది. అమెరికాకు వెళ్లిన సౌత్ సూడాన్ పౌరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వాళ్ల వీసాలను ట్రంప్‌ ప్రభుత్వం రద్దు చేస్తోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.

New Update
US revokes all South Sudan visas over failure to repatriate citizens

US revokes all South Sudan visas over failure to repatriate citizens

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా అక్రమ వలసదారులను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సరైన డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా దేశంలో ఉంటున్న వాళ్లని స్వదేశాలకు పంపించేస్తున్నారు. అయితే ఇటీవల అమెరికాకు వచ్చిన ఆఫ్రికన్ పౌరులను కూడా తమ దేశాలకు తిరిగి పంపించారు. కానీ వాళ్లని తీసుకునేందుకు పలు ఆఫ్రికా దేశాలు నిరాకరించాయి. దీంతో ట్రంప్ వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

అమెరికాకు వెళ్లిన ఆయా దేశాల పౌరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వాళ్ల వీసాలను ట్రంప్‌ సర్కార్‌ రద్దు చేస్తోంది. వలసదారుల చట్టాల అమలును వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శనివారం తెలిపారు.  '' డిపోర్టేషన్ విషయంలో తన ప్రవర్తన మార్చుకొని.. సమస్యను పరిష్కరించే దాకా దక్షిణ సూడాన్‌కు చెందిన వాళ్ల వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేశాం. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

కొత్త వీసాల జారీ ప్రక్రియ నిలిపివేస్తున్నాం. దీనివల్ల అక్కడి పౌరులు ఎవరూ కూడా అమెరికా ప్రవేశించే ఛాన్స్ ఉండదు. దక్షిణ సూడాన్‌ పాస్‌పోర్ట్‌దారులకు అమెరికాలోని అన్నీ వీసాలకు విలువలేదు. వాళ్లు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ట్రంప్ పాలన విధానానికి దక్షిణ సూడాన్‌ సహకరించినప్పుడు మాత్రమే ఈ కఠిన నియమాలు సమీక్షిస్తామని'' మార్కో రూబియో తెలిపారు.  ఇదిలాఉండగా.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టాక దాదాపు 8 వేల మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు వైట్‌హౌస్ తెలిపింది. వీళ్లలో కొందరిని వెనక్కి పంపగా.. మరికొందరు జైళ్లలో ఉన్నారని పేర్కొంది. ఇంకొందరు నిర్బంధ కేంద్రంలో ఉన్నట్లు చెప్పింది. 

 telugu-news | rtv-news | usa | africa | visa 

Advertisment
Advertisment
Advertisment