/rtv/media/media_files/2025/04/06/WtvLinUjbabY37taDYB6.jpg)
JLR cars
జాగ్వారా, ల్యాండ్ రోవర్ బిట్రన్ లో తయారయ్యే కార్లు. టాటా మోటార్స్ కు చెందిన లగ్జరీ కార్లు ఇవి. బ్రిటన్‌లో అతిపెద్ద కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన జేఎల్‌ఆర్ సంస్థ.. బ్రిటన్‌లో సుమారు 38 వేలమందికి ఉపాధి కల్పిస్తోంది. ఇప్పుడు ఈ కంపెనీ తమ కార్లను అమెరికాకు ఎగుమతి చేయడాన్ని నెల పాటూ ఆపాలని నిర్ణయించుకుంది. రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు తమ దేశంలోకి దిగుమతయ్యే వాహనాలపై 25శాతం టారీఫ్ లను విధించారు. దీంతో టాటా జాగ్వార్ తమ కార్ల ఎగుమతులను నెలపాటూ ఆపేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ది టైమ్స్ చెబుతోంది. సుంకాలను ఎలా తగ్గించుకోవాలని ఆలోచించడానికే ఈ బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆలోచనలో పడ్డ అన్ని కంపెనీల కార్లు..
జెఎల్ ఆర్ ఒక్కటే కాదు..ఇతర దేశాల్లో తయారయ్యే అన్ని కార్ల కంపెనీలు ఇదే ఆలోచనలో పడ్డాయని చెబుతున్నారు. అయితే జే ఎల్ ఆర్ ఇప్పటికే మరో రెండు నెలలకు సరిపడా కార్లను అమెరికాకు ఎగుమతి చేసేసింది. అందుకే ఇప్పుడు నెల గ్యాప్ తీసుకున్నా పర్వాలేదని భావిస్తోంది. ఈ నెలలో సుంకాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చని అనుకుంటోంది. 2024 మార్చి వరకు 12 నెలల వ్యవధిలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ 4.30 లక్షల వాహనాలను విక్రయించగా.. అందులో నాలుగో వంతు అమెరికాలో అమ్ముడయ్యాయి. మరోవైపు ట్రంప్ ప్రకటించిన టారీఫ్ లవలన టాటా మోటార్స్ షేర్లు బాగా పడిపోయాయి.
today-latest-news-in-telugu | cars | tata-motors
Also Read: USA: అమెరికాకు సుంకాల దెబ్బ..ధరల పెరుగుతాయని స్టోర్లకు పరుగెడుతున్న జనాలు