Israel: 90 మంది బందీలను విడుదల చేసిన ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది.ఒప్పందంలో భాగంగా 90మంది పాలస్తీనా ఖైదీలతో కూడిన మొదటి బ్యాచ్ ఇజ్రాయెల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు.

New Update
isarel

isarel

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలుస్తుంది. ఒప్పందం స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30గంటలకు అమల్లోకి రావాల్సి ఉండగా.. దాదాపు మూడు గంటలు ఆలస్యమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. హమాస్ నుంచి ఇజ్రాయెల్ బందీల జాబితా విడుదలలో జాప్యం కావడంతో తొలుత శాంతి ఒప్పందం అమలుపై సందిగ్దత ఏర్పడింది. చివరకు ఇజ్రాయెల్ కు చెందిన ముగ్గురు బందీలను హమాస్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Also Read: Joe Biden: అధ్యక్షుడిగా చివరి రోజు.. జో బైడెన్‌ ఎక్కడ గడిపారో తెలుసా?

 గాజాకు చేరుకున్న రెడ్ క్రాస్ ప్రతినిధులకు ఈ బందీలను అప్పగించింది. హమాస్ విడుదల చేసిన బందీల్లో ఎమిలీ దమారీ , డోరాన్ స్టెయిన్ బ్రేచర్, రోమి గోనెన్,  లు ఉన్నారు. వారిని రెడ్ క్రాస్ ప్రతినిధులు ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించారు.ఇజ్రాయెల్ బందీలు సొంత గడ్డపై అడుగు పెట్టగానే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ.. బందీల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. 

బందీల విడుదల దృశ్యాలను వీక్షించేందుకు టెలీ అవీవ్ లో వేల సంఖ్యలో ప్రజలు గుమ్మికూడారు. ఇందుకోసం రోడ్లపై పలుచోట్ల పొడవైన స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఒప్పందం అమల్లోకి వచ్చిన సందర్భంగా గాజాలో ప్రజలు ర్యాలీలు తీశారు. చాలా మంది ప్రజలు తమ స్వస్థలాలకు వెళ్తున్నారు.ఒప్పందంలో భాగంగా 90మంది పాలస్తీనా ఖైదీలతో కూడిన మొదటి బ్యాచ్ ఇజ్రాయెల్ కస్టడీ నుంచి విడుదలయ్యారు. వారిలో మైనర్లు, మహిళలు ఉన్నారని పాలస్తీనా అధికారులు తెలిపారు. 

Also Read: Donald Trump: పగ్గాలు చేపట్టకముందే ట్రంప్ వార్నింగ్‌ లు..చచ్చినట్లు ఒప్పుకుంటున్న సంస్థలు!

2వేల మంది పాలస్తీనా ఖైదీలు...

రాళ్లు విసరడం, హత్యాయత్నం వంటి నేరాలకు పాల్పడినందుకు ఇజ్రాయెల్ వీరిని అరెస్టు చేసింది. అయితే, మొదటి దశలో కాల్పుల విరమణ 42రోజుల పాటు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ దశలో 33 మంది బందీలు, దాదాపు 2వేల మంది పాలస్తీనా ఖైదీలు దశల వారిగా విడుదలవుతారని అందరూ అనుకుంటున్నారు. ఒప్పందంలో భాగంగా మొదటి దశలో ఇజ్రాయెల్ దళాలు జనావాస ప్రాంతాల నుంచి వెనుదిరుగుతాయి అదేవిధంగా గాజాలోకి ఆహారం, నీరు, ఇతర మౌలిక సదుపాయాలను అందించేందుకు ఇజ్రాయెల్ సైన్యం అనుమతిస్తుంది.రెండో దశలో మిగిలిన బందీలను హమాస్ విడుదల చేస్తుంది. 

అయితే, రెండో దశ సమయానికి ఇజ్రాయెల్, హమాస్ మధ్య మళ్లీ యుద్ధవాతావరణం నెలకుంటుందా అనే ఆందోళనసైతం వ్యక్తమవుతుంది. హమాస్ ఈ ఒప్పందాన్ని మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరుకుంటుంది. 2023 అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌ పై హమాస్‌ మెరుపుదాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 1200 మందికి పైగా ఇజ్రాయెల్‌ పౌరులు చనిపోగా, 250 మందిని హమాస్‌ మిలిటెంట్లు బందీలుగా బంధించారు.

దీంతో హమాస్‌పై ఇజ్రాయెల్‌ భీకరంగా విరుచుకుపడింది. గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో 46,000 మందికిపైగానే పాలస్తానీయులు మృతిచెందారు. అయితే, దాదాపు పదిహేను నెలలుగా సాగుతున్న యుద్ధానికి తాజాగా కాల్పుల విరమణ ఒప్పందంతో తెరపడినట్లు తెలుస్తుంది. ఈ ఒప్పందం సుదీర్ఘంగా కొనసాగుతుందా.. అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారు సంఘంలో కీర్తి ప్రతిష్ఠ పొందుతారు..అంతే కాకుండా..

Also Read: Donald Trump: ట్రంప్‌ ప్రమాణ స్వీకారం నేడే..వాషింగ్టన్‌ చేరుకున్న కొత్త అధ్యక్షుడు

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Zelensky: క్రిమియాపై ఉక్రెయిన్‌ సంచలన కామెంట్స్‌..

క్రిమియా రష్యాతోనే ఉంటుందని ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై తాజాగా ఉక్రెయిన్ స్పందించింది. క్రిమియాను తాము ఎప్పటికీ కూడా రష్యాలో భాగంగా గుర్తించమని స్పష్టం చేసింది. అమెరికా శాంతి ప్రతిపాదనలకు అసలు అర్థమే లేదని పేర్కొంది.

New Update
Zelensky

Zelensky

రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై రష్యా నియంత్రణను అమెరికా గుర్తించిందని ఇటీవల ట్రంప్ చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే ఇకనుంచి క్రిమియా రష్యాతోనే ఉంటుందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై తాజాగా ఉక్రెయిన్ స్పందించింది. అమెరికా శాంతి ప్రతిపాదనలో క్రిమియాపై రష్యా అధికారం ఉంటుందని చెప్పడం షాక్‌కు గురిచేసిందని తెలిపింది. 

Also Read: పహల్గాం దాడిని పూర్తిగా షూట్‌ చేసిన వీడియోగ్రాఫర్‌.. కానీ

Ukraine Comments On Crimea

క్రిమియాను తాము ఎప్పటికీ కూడా రష్యాలో భాగంగా గుర్తించమని స్పష్టం చేసింది. అమెరికా శాంతి ప్రతిపాదనలకు అసలు అర్థమే లేదని జెలెన్‌స్కీ పార్టీ శాసనసభ్యుడు ఒలెక్సాండర్‌ మెరెజ్ఖో తెలిపారు. రష్యాను క్రిమియా చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని.. దాన్ని ఆ దేశానికి పూర్తిగా ఇచ్చేయడం అసాధ్యమన్నారు. ఇందుకోసం తమ దేశ రాజ్యాంగంలో మార్పులు చేయాలని.. అలాగే దేశవ్యాప్తంగా ప్రజల నుంచి అంగీకారం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. 

Also Read: పాకిస్తాన్‌లో 170 న్యూక్లియర్ బాంబులు.. వాటి రిమోట్ ఎవరి చేతిలో ఉందో తెలుసా..?

క్రిమియాను వదులుకోవడం అంటే తమ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రాజకీయ ఆత్మహత్యతో సమానమని తెలిపారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. దీన్ని తమ దేశంలో రాజద్రోహంగా భావిస్తామన్నారు. ఇదిలాఉండగా. దక్షిణ ఉక్రెయిన్‌లో నల్ల సముద్రం వెంట క్రిమియా ప్రాంతం ఉంది. అయితే 2014లో రష్యా దాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 

Also Read: పహల్గాం దాడికి ముందు ఉగ్రవాదులు ఏం చేశారో తెలుసా? వెలుగులోకి సంచలన నిజాలు

Also Read :  నక్సలైట్లను చంపొద్దు.. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపండి: కేసీఆర్ సంచలనం!

telugu-news | rtv-news | russia-ukraine | zelensky | trump 

Advertisment
Advertisment
Advertisment