/rtv/media/media_files/2026/04/02/irgc-2026-04-02-19-14-08.jpg)
IRGC now Iran's de facto ruler amid rift with President
ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకున్నాయి. దేశాధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే IRGC ఇరాన్ ప్రభుత్వ బాధ్యతలను అనధికారికంగా తన చేతుల్లోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధం, ఆర్థిక సంక్షోభం వల్ల కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అధ్యక్షుడు ఫెయిల్ అయ్యారని ఐఆర్‌జీసీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే మిలిటరీ నాయకత్వం పాలనా వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: మరో బాంబు పేల్చిన ఒరాకిల్.. మళ్లీ వేలాది ఉద్యోగులకు లేఆఫ్స్!
IRGC Now Iran's De Facto Ruler Amid Rift
ప్రభుత్వంలో కీలకమైన నియామకాలు, భద్రతాపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో అధ్యక్షుడు పెజెష్కియాన్, IRGC చీఫ్ కమాండర్ అహ్మద్ వహీదీకి మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ మంత్రి నియామకానికి సంబంధించి పెజెష్కియాన్ ప్రతిపాదించిన పేర్లును IRGC తోసిపుచ్చింది. అలాగే యుద్ధ పరిస్థితుల దృష్ట్యా అన్ని సున్నితమైన పదవులను కూడా తామే పర్యవేక్షిస్తామని తేల్చిచెప్పింది. దీంతో ఇరాన్ అధ్యక్ష కార్యాలయం కేవలం నామమాత్రంగా మారిపోయిందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం పూర్తి అధికారం IRGC చేతుల్లోకి వెళ్ళిందని చెబుతున్నారు.
ఇదిలాఉండగా కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యం, ప్రస్తుత స్థితిగతులపై సందిగ్ధత నెలకొంది. ఇప్పటిదాకా ఆయన బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. దీంతో ఇరాన్ ప్రభుత్వ పాలన సంక్షోభం మరింత తీవ్రతరమవుతోంది. ప్రభుత్వ నివేదికలు సుప్రీం లీడర్‌కు అందకుండా IRGC అడ్డుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి పతనమవ్వడం, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోవడం లాంటి అంశాలపై అధ్యక్షుడు పెజెష్కియాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. సైనిక నాయకత్వం మాత్రం యుద్ధ వ్యూహాలకే ప్రాధాన్యత ఇస్తోంది. పౌర ప్రయోజనాలను పక్కన పెడుతోంది.
Also Read: పూటకో మాట రోజుకో వేషం.. ‘అపరిచితుడు’ సినిమా చూపిస్తున్న ట్రంప్
అయితే ఇరాన్‌లో అధికార మార్పిడి జరిగితే ఆ దేశ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరికలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిని పక్కన పెట్టి.. పాలన బాధ్యతలను IRGC కంట్రోల్‌లోకి తెచ్చుకుంటే అంతర్జాతీయంగా ఇరాన్ మరింత ఒంటరి అయ్యే ఛాన్స్ ప్రమాదం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్, అమెరికాతో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. ఇరాన్ లోపల జరుగుతున్న ఈ రాజకీయ సంక్షోభం పశ్చిమాసియాలో మరిన్ని ప్రకంపనలు సృష్టించనుంది.
Follow Us