Iran's Weapon: గజ గజ వణుకుతున్న ట్రంప్.. యుద్ధంలో ఇరాన్‌కు దొరికిన సీక్రెట్ వెపన్ ఇదే!

యుద్ధంలో ఇరాన్ అగ్రరాజ్యం అమెరికాపై అనుసరిస్తున్న వ్యూహం మంచి రిజల్ట్స్ ఇస్తోంది. ట్రంప్‌ను ఇరాన్ చర్చల దాకా తీసుకురాగలిగింది. అగ్రరాజ్యం, మధ్యప్రాచ్య శక్తి ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యాయి.

New Update
iran

యుద్ధంలో ఇరాన్ అగ్రరాజ్యం అమెరికా(iran america war) పై అనుసరిస్తున్న వ్యూహం మంచి రిజల్ట్స్ ఇస్తోంది. ట్రంప్‌ను ఇరాన్ చర్చల దాకా తీసుకురాగలిగింది. అగ్రరాజ్యం, మధ్యప్రాచ్య శక్తి ఇరాన్ మధ్య శాంతిని నెలకొల్పేందుకు ఇస్లామాబాద్‌లో జరిగిన చర్చలు ఫెయిల్ అయ్యాయి. 21 గంటల పాటు సాగిన చర్చల్లో అమెరికా విధించిన కండీషన్లకు అంగీకరించేందుకు ఇరాన్ ఒప్పుకోలేదు. హోర్ముజ్ జలసంధి నియంత్రణ, యురేనియం శుద్ధి వంటి కీలక అంశాలపై ఇరాన్ తన పట్టు సడలించకపోవడంతో దౌత్య ప్రయత్నాలు విఫలమయ్యాయి. యుద్ధంలో అమెరికాను ఇరాన్(Irans Weapon) ఎన్ని రోజులు ఉంచగలిగితే ఇరాన్‌కు అంత లాభం. ఎందుకంటే అగ్రరాజ్యానికి ఆర్థిక భారం పెరుగుతోంది. ట్రంప్‌పై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది.

Also Read :  హర్మూజ్‌లో మళ్లీ టెన్షన్‌..టెన్షన్‌.. ఆ ట్యాంకర్‌లు యూటర్న్‌

ఆర్థిక బలహీనతను అధిగమించిన వ్యూహం

అమెరికా రక్షణ బడ్జెట్ ఇరాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థ కంటే పెద్దది. 31 ట్రిలియన్ డాలర్ల అమెరికా ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే, కేవలం 400-460 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కలిగిన ఇరాన్ ఒక చిన్న దేశం. బలహీనపడుతున్న కరెన్సీ, అధిక ద్రవ్యోల్బణం, చమురుపై అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇరాన్ అగ్రరాజ్యాన్ని దైర్ఘ్యం ఎదుర్కొడానికి వెనుక బలమైన వ్యూహం ఉంది.

ప్రపంచ ఆర్థిక నాడి ఇరాన్ చేతిలో..

ఈ యుద్ధంలో ఇరాన్ తన నాయకులను, ప్రజలను కోల్పోయినప్పటికీ, భౌగోళికంగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని తన ఆదాయ వనరుగా మార్చుకుంది. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైన ఈ జలసంధి ద్వారా ప్రయాణించే ఓడలపై బ్యారెల్‌కు ఒక డాలర్ చొప్పున సుంకం విధించేందుకు ఇరాన్ సిద్ధమైంది. దీని ద్వారా ఏడాదికి సుమారు 70 నుండి 80 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించాలని ఇరాన్ యోచిస్తోంది. నాటో మద్దతు లేకుండా ఈ జలసంధిలో అమెరికా ఏమీ చేయలేదనే బలహీనతను ఇరాన్ పసిగట్టింది.

అమెరికాపై యుద్ధ ప్రభావం

యుద్ధం పొడిగించబడటంతో అమెరికాకు ఇప్పటికే 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. చమురు ధరలు గ్యాలన్‌కు 4 డాలర్లు దాటడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగి, ప్రజల్లో ట్రంప్(Donald Trump) ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మధ్యంతర ఎన్నికల దృష్ట్యా ఈ యుద్ధాన్ని ముగించాలని అమెరికా భావిస్తోంది, కానీ ఇరాన్ మాత్రం తన షరతులపైనే మొండిగా ఉంది.

Also Read :  చైనాకు ట్రంప్ వార్నింగ్: ఇరాన్‌కు ఆయుధాలిచ్చారో.. ఇక మీ పని ఖతం!

పెరిగిన ఇరాన్ ప్రాబల్యం

యుద్ధం కారణంగా అమెరికా ఆంక్షలను 30 రోజుల పాటు సడలించడంతో, భారత్, చైనా వంటి దేశాలకు చమురు విక్రయించడం ద్వారా ఇరాన్ భారీగా లాభపడింది. 40 రోజుల పాటు అగ్రరాజ్యాన్ని ఎదిరించి నిలబడటం ద్వారా గల్ఫ్ దేశాల్లో ఇరాన్ ఆధిపత్యం పెరిగింది. సౌదీ అరేబియా, ఇజ్రాయెల్ వంటి దేశాలు కూడా ఇరాన్ శక్తిని చూసి ఆశ్చర్యపోతున్నాయి. మొత్తానికి, ఇస్లామాబాద్ చర్చలు విఫలమవ్వడం ఇరాన్ ప్లాన్ చేసిన దౌత్యపరమైన ఎత్తుగడగా విశ్లేషకులు భావిస్తున్నారు. కోల్పోవడానికి ఏమీ లేని స్థితి నుండి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఇరాన్ చేరుకోవడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు