/rtv/media/media_files/2026/04/07/fotojet-3-2026-04-07-15-56-27.jpg)
Mojtaba Khamenei-Pezeshkian
Mojtaba Khamenei : ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్దం(Iran US Isarel War) మొదలైన తొలిరోజే ఫిబ్రవరి 28న అమెరికా చేసిన వైమానిక దాడుల్లో అప్పటి ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. అదే దాడిలో ఆయన కుమారుడు ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ కూడా తీవ్రంగా గాయపడ్డట్లు ప్రచారం సాగుతోంది. ఆయన ఆ గాయాల మూలంగా కోమాలోకి వెళ్లారని తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం ఇరాన్ లోని కోమ్ నగరంలో చికిత్స పొందుతున్నారని చెబుతున్నారు. ఈ మేరకు అమెరికా- ఇజ్రాయెల్‌కు ఈ విషయమై నిఘా సమాచారం ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో ఈ వార్తలు రావడం సంచలనంగా మారింది. కాగా ‘‘ఖమేనీ అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన నిర్ణయాలు కూడా తీసుకోలేని స్థితిలో ఉన్నారు’’ అని ఆ కథనాలు వెల్లడిస్తున్నాయి. కాగా, అమెరికా -ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఆయన ఆచూకీ గురించి వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
ఇదిలా ఉండగా ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో నాటి ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా ఖమేనీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలను కూడా కోమ్ నగరంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక, యుద్ధం ప్రారంభమైన దగ్గరినుంచి మొజ్తాబా బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. మొజ్తాబా కూడా తీవ్రంగా గాయపడ్డాడని, ఆయన మరణించిన ఆశ్చర్యపోనక్కరలేదని అమెరికా చెబుతూ వప్తోంది. కానీ ఆయన పేరు మీద అప్పుడప్పుడు ప్రకటనలు వెలువడుతున్నాయి. ఘర్షణలు ప్రారంభమైన తొలిరోజే ఆయన కూడా గాయపడ్డారని, ఈ విషయాన్ని ఇరాన్ కూడా ధ్రువీకరించింది. అయితే ఆయన కోమాలో ఉన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు ఇటీవల ఆయన ఇరాన్ దాడుల్ని సమీక్షిస్తున్నట్టుగా ఉన్న ఒక ఏఐ వీడియోను ఇరాన్ విడుదల చేసింది. మరోవైపు ఆయనే తమ దేశానికి నాయకత్వం వహిస్తున్నారని అధికారులు చెబుతుండటం గమనార్హం.
Also Read : యుద్ధం ఆపడానికి: అమెరికా ముందు ఇరాన్ 10 కండీషన్లు.. ట్రంప్‌కు షాక్
దేశం కోసం ప్రాణత్యాగానికి సిద్ధం
ఇదిలా ఉండగా హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని లేదంటే దాడులు తప్పవని అమెరికా ఓ వైపు హెచ్చరించడమే కాకుండా డెడ్‌లైన్ కూడా విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ఇరాన్ ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ విషయమై ఆ దేశ అధ్యక్షుడు పెజెష్కియాన్(Iranian President Masoud Pezeshkian) కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ప్రాణాలను త్యాగం చేయడానికి తనతో సహా ఇరాన్ పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేయడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానన్నారు. ఏదేమైనా పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేయడం గమనార్హం
మరికొన్ని గంటల్లో ఇరాన్(iran us conflict) హర్మూజ్‌ను తెరవాలని, లేదంటే ఆ దేశంలోని అనేక స్థావరాలు, మౌలిక సదుపాయాలను లక్ష్యం చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. అంతేకాక ఈ సారి ఎటువంటి డెడ్‌లైన్ పొడిగింపులు ఉండబోవని స్పష్టం చేశారు. ఇరాన్‌ను తమ బలగాలు ఒక్కరాత్రిలో తుడిచి పెట్టేయగలవని.. ఆ రాత్రి మంగళవారం రాత్రే కావొచ్చనీ ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ అమెరికా ప్రతిపాదనలకు, తాత్కాలిక ఒప్పందాలకు అంగీకరించబోమని ఇరాన్ తేల్చి చెప్పింది. దీంతో యుద్ధం మరింత ముదురుతుందని పశ్చిమాసియా దేశాల్లో ఆందోళన మొదలైంది. ఈ క్రమంలో ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమని ఇరాన్ అధ్యక్షుడు ప్రకటించడం మరింత ఆందోళనకరంగా మారింది.
Also Read : ఇరాన్ ఓవరాక్షన్ వల్లే ట్రంప్ షాకింగ్ నిర్ణయం.. రాత్రికి రాత్రే అమెరికా బీభత్సం...?
Follow Us