/rtv/media/media_files/2026/03/24/donald-trump-2026-03-24-15-25-56.jpg)
గత కొంతకాలంగా ఇరాన్(iran), అమెరికా(america) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అయితే, తాజాగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికాతో ఒక ఒప్పందానికి రావాలని ఆయన నిర్ణయించుకున్నట్లగా ఇజ్రాయిల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) కూడా స్పందిస్తూ.. ఇరాన్‌తో చర్చలు జరుగుతున్నాయని, కొన్ని ముఖ్యమైన అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడించారు. ఈ చర్చల్లో ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్ ఆయన అల్లుడు జారెడ్ కుష్నర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
Also Read : అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. పెలిన హీటర్ .. కమ్మేసిన పొగ!
చర్చలు సీరియస్ దశకు
ఇరాన్‌తో చర్చలు సీరియస్ దశకు చేరుకున్నాయని, రాబోయే ఐదు రోజుల్లో ఒక స్పష్టమైన ఫలితం వచ్చే అవకాశం ఉందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. "ఈసారి ఇరాన్ చాలా పట్టుదలగా ఉంది, అందరికీ మేలు జరిగే మంచి ఒప్పందం కుదురుతుందని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఇరాన్ అధికారిక వార్తా సంస్థ ఫార్స్'మాత్రం అమెరికాతో ఎటువంటి నేరుగా చర్చలు జరగడం లేదని భిన్నమైన వాదన వినిపిస్తోంది.
గతంలో ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే చర్చల నేపథ్యంలో ఆ దాడులను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఇరాన్ కూడా ఒకవేళ అమెరికా తమపై దాడులు చేస్తే, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలకు విద్యుత్ అందించే కేంద్రాలపై దాడులు చేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి ప్రస్తుతం మూతపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. చర్చలు సఫలమైతే ఈ జలసంధిని త్వరలోనే తెరుస్తామని, బహుశా దీనిని ఉమ్మడి నియంత్రణలోకి తీసుకువచ్చే అవకాశం ఉందని ట్రంప్ సూచనప్రాయంగా తెలిపారు. ఫిబ్రవరి 28 నుండి మొదలైన ఈ ఉద్రిక్తతల వల్ల ఇప్పటికే 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Also Read : ఇరాన్ 'పవర్ హౌస్'.. ట్రంప్‌తో చర్చల వెనుక ఉన్న అసలు వ్యక్తి ఈయనేనా?
Follow Us