Iran: మేథమెటికల్ ఫార్ములాతో అమెరికాను హెచ్చరించిన ఇరాన్.. ΔO_BSOH>0 ⇒ f(f(O))>f(O) దీని అర్థం ఏంటో తెలుసా

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఘాలిబాఫ్ దీనిపై వ్యంగ్యంగా స్పందించారు.

New Update
Iran mocks Trump with 'mathematical' warning over Strait of Hormuz blockade

Iran mocks Trump with 'mathematical' warning over Strait of Hormuz blockade

అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఘాలిబాఫ్ దీనిపై వ్యంగ్యంగా స్పందించారు. వైట్ హౌస్ దగ్గర్లోని ప్రస్తుత పెట్రోల్ ధరల ఫొటోను షేర్ చేస్తూ.. త్వరలోనే అమెరికన్లు ఈ తక్కువ ధరల కోసం ఎదురుచూసే (Nostalgic) రోజులు వస్తాయని హెచ్చరించారు. “ΔO_BSOH > 0 ⇒ f(f(O)) > f(O)” అనే సూత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 


 
అయితే ఈ వింత సమీకరణంపై చర్చ మొదలైంది. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..  ΔO_BSOH > 0 అంటే హర్మూజ్ జలసంధి వద్ద దిగ్బంధనం లేదా ఉద్రిక్తత పెరగడం అని అర్థం. ఇలా జరిగితే చమురు ధరలు సాధారణంగా పెరగడమే కాక ఘాతాంక పద్ధతిలో దూసుకుపోతాయని ఈ ఫార్ములా చెబుతోంది. మొదట సరఫరా తగ్గడం వల్ల ధర పెరుగుతుంది (f(O)). ఆ తర్వాత పెరిగిన ధరపై మళ్లీ ఒత్తిడి పెరిగి మరింత పెరుగుదలకు దారితీస్తుంది (f(f(O))).

మరింత వివరంగా 

ΔO_BSOH>0 ⇒ f(f(O))>f(O)

ఇక్కడ డెల్టా (Δ) అనేది మార్పును సూచిస్తుంది. 
BSOH అంటే 'Blockade of Strait of Hormuz'
ఇది సున్నా కంటే ఎక్కువగా ఉండటం అంటే, జలసంధి వద్ద ఉద్రిక్తతలు లేదా ఆంక్షలు పెరగడం అని అర్థం.

O,  f(O) (ధర పెరగడం):
O: ప్రస్తుత చమురు ధర
f(O): ఇది ఒక ఫంక్షన్. హర్మూజ్ దిగ్బంధనం కారణంగా సరఫరా తగ్గితే ధర పెరుగుతుంది. అంటే, మొదటి దశలో ధర సాధారణంగా పెరగడం. 

 f(f(O)) (ఘాతాంక పెరుగుదల):
f(O): తగ్గిన సరఫరా వల్ల ధర పెరుగుతుంది 
పెరిగిన ధర వల్ల మార్కెట్‌లో భయం , ఇన్సూరెన్స్ ఖర్చులు, ఇతర దేశాల ఒత్తిడి పెరుగుతుంది.
f(f(O)): ఈ పరిణామాలు మళ్ళీ ధరను మరింత వేగంగా పెంచుతాయి 

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌ వేదికగా జరిగిన చర్చలు విఫలం కావడం వల్ల హర్మూజ్ జలసంధిలోకి ప్రవేశించే నౌకలను అడ్డుకుంటామని అమెరికా సైన్యం తెలిపింది. ప్రస్తుతం గ్యాలన్ పెట్రోల ధర 4 నుంచి 5 డాలర్ల వద్దే ఉందని.. ఒకవేళ దిగ్బంధనం అమల్లోకి వస్తే ఈ ధరలు అమాంతం పెరిగిపోతాయని ఇరాన్ హెచ్చరించింది. చమురు రవాణాకు కీలక మార్గమైన హర్మూజ్ జలసంధిలో అంతరాయం ఏర్పడితే ఇది గొలుసుకట్టు చర్యలా మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతం చేస్తుందని  ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ఈ ఫార్ములా ద్వారా వెల్లడించారు. 

Also Read: అమెరికాకు బిగ్ షాక్.. దేశ భద్రత కోసం ఇతర దేశాల వైపు చూస్తున్న గల్ఫ్ దేశాలు

ఇదిలాఉండగా అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం ఉదయం 10 గంటల నుంచి (భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలు) నుంచి ఈ హర్మూజ్‌పై దిగ్బంధనాన్ని ప్రారంభించనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఇప్పటికే మళ్లీ సెంచరీ మార్కు దాటేలా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇరాన్ మాత్రం ప్రపంచ ఇంధన అవసరాలను ఆసరగా చేసుకుంటూ ఆర్థిక హెచ్చరికలతో దాడికి దిగుతోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు