Gold Discounts: వార్ దెబ్బ.. దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్.. ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు!

ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధం వల్ల దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు.

New Update
dubai

dubai

ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఈ యుద్ధం వల్ల దుబాయ్‌లో బంగారంపై భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా విమాన, నౌకా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్ ధర కంటే ఔన్సు 31.10 గ్రాములు బంగారాన్ని సుమారు 30 డాలర్లు అంటే దాదాపు రూ.2,700 పైగా తక్కువకే విక్రయిస్తున్నారు. డెలివరీ లేకపోవడం, రవాణా ఖర్చులు పెరగడం వల్ల కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బంగారం వ్యాపారానికి దుబాయ్ ప్రపంచంలోనే ప్రధాన కేంద్రం. అయితే గల్ఫ్ దేశాల్లో యుద్ధం జరుగుతుండటంతో విమాన సర్వీసులు అరకొరగానే నడుస్తున్నాయి. దీనివల్ల దుబాయ్ నుంచి ఇతర దేశాలకు సరకును పంపడం కష్టంగా మారింది. రవాణా సంస్థలు, బులియన్ వ్యాపారులు కొత్త ఆర్డర్లు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. ఎందుకంటే డెలివరీ ఆలస్యమవ్వడమే కాకుండా, బీమా ఖర్చులు కూడా భారీగా పెరిగాయి. తమ వద్ద ఉన్న నిల్వలు వృథాగా పడి ఉండటం ఇష్టం లేక అక్కడి వ్యాపారులు తక్కువ ధరకైనా అమ్మేందుకు సిద్ధపడుతున్నారు.

ఇది కూడా చూడండి: Sundar Pichai: సుందర్ పిచాయ్‌కు భారీ ప్యాకేజీని పెంచిన గూగుల్..

ఇది కూడా చూడండి: BIG BREAKING: ఇరాన్‌ ఓడిపోయింది.. ట్రంప్ సంచలన ప్రకటన

విమాన ప్రయాణాలకు ఆటంకం కలగడంతో..

సాధారణంగా బంగారాన్ని ప్రయాణికుల విమానాల్లోనే సురక్షితంగా తరలిస్తుంటారు. ప్రస్తుతం యూఏఈ విమానాల రాకపోకలకు ఆటంకాలు కలగడంతో సౌదీ అరేబియా లేదా ఒమన్ వంటి పొరుగు దేశాల మీదుగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అంతర్జాతీయంగా బంగారం ధర ఔన్సు 5,100 డాలర్లకు పైగా ఉండటంతో సరిహద్దులు దాటించే సమయంలో భద్రతా పరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రవాణా సంస్థలు ఈ రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపడం లేదు.  ప్రస్తుతం భారత్‌లో బంగారానికి గిరాకీ పెరిగింది. జనవరిలో పెద్ద మొత్తంలో దిగుమతులు జరగడం వల్ల ప్రస్తుతం తగినన్ని నిల్వలు అందుబాటులో ఉన్నాయి. దీంతో బంగారం డెలివరీ దుబాయ్ నుంచి ఆలస్యమైనా కూడా పెద్దగా ఇబ్బంది లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే ముడి బంగారం సరఫరాలో మాత్రం కొన్ని ఆటంకాలు ఉన్నాయి. యుద్ధం కారణంగా ఇతర ప్రాంతాల నుంచి బంగారం తెప్పించుకోవడానికి రవాణా ఖర్చులు 60-70 శాతం వరకు అదనంగా అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే యుద్ధం ముగిసే వరకు ఇలానే ఉంటుంది.

ఇది కూడా చూడండి: Gulf: పశ్చిమాసియాలో యుద్ధం.. గల్ఫ్ దేశాల్లో మనవాళ్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ? లెక్కలు ఇవే

ఇది కూడా చూడండి: Russia: భారత్‌కు షాక్‌.. చమురు ధరలు భారీగా పెంచిన రష్యా

Advertisment
తాజా కథనాలు