/rtv/media/media_files/2026/04/05/internet-shutdown-in-iran-2026-04-05-17-39-56.jpg)
మనకు ఒక్క నిమిషం పాటు నెట్ రాకుంటేనే చిర్రెత్తిపోతాం.. ఇంటర్నెట్(internet-bandh) స్లో ఉండి బఫరింగ్ అయితే నెట్‌కంపెనీని పిచ్చి బూతులు తిట్టుకుంటాం. కానీ ఇరాన్‌లో దాదాపు నెల రోజులకు పైగా ఇంటర్‌నెట్‌పై నిషేదం విధించారు. ఇరాన్‌తో ఇజ్రాయెల్, అమెరికా చేస్తున్న యుద్ధంలో ఆ దేశం అంధకారంలో కూరుకుపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దళాలు టెహ్రాన్‌పై జాయింట్ ఆర్మీ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇరాన్ ఆ దేశంలో విధించిన ఇంటర్నెట్ షట్‌డౌన్ ఇప్పుడు ఐదో వారంలోకి చేరింది. ఏప్రిల్ 5, ఆదివారంతో ఈ బ్లాక్‌అవుట్ వరుసగా 37వ రోజుకు (864 గంటలు) చేరుకుందని అంతర్జాతీయ ఇంటర్నెట్ మానిటర్ 'నెట్‌బ్లాక్స్'వెల్లడించింది. ప్రపంచ చరిత్రలో ఓ దేశంలో జరిగిన సుదీర్ఘమైన ఇంటర్నెట్ షట్‌డౌన్‌గా ఇది రికార్డు సృష్టించింది.
Also Read : అగ్రరాజ్యానికే చైనా 'AI' షాక్: ఇరాన్‌కు సీక్రెట్ డేటా.. అమెరికా సేనలపై డ్రాగన్ నిఘా!
రికార్డు స్థాయి బ్లాక్‌అవుట్.. 864 గంటల నిశ్శబ్దం
నెట్‌బ్లాక్స్ X వేదికగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 5, ఆదివారం నాటికి ఇరాన్‌లో ఇంటర్నెట్ నిలిచిపోయి(internet-shutdown) వరుసగా 37వ రోజుకు (864 గంటలు) చేరుకుంది. గత ఫిబ్రవరి 28, శనివారం నాడు ప్రారంభమైన ఈ షట్‌డౌన్, గతంలో మయన్మార్, సూడాన్, కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో జరిగిన సంఘటనల తీవ్రతను కూడా అధిగమించింది. "ప్రపంచ నెట్‌వర్క్‌కు అనుసంధానమై ఉండి, ఆ తర్వాత పూర్తిగా జాతీయ నెట్‌వర్క్‌కు మళ్ళడం ద్వారా గ్లోబల్ ఇంటర్నెట్‌ను కోల్పోయిన మొదటి దేశం ఇరాన్" అని నెట్‌బ్లాక్స్ పేర్కొంది. ఉత్తర కొరియా వంటి దేశాలు మొదటి నుంచీ అంతర్జాతీయ నెట్‌వర్క్‌కు దూరంగా ఉన్నప్పటికీ, ఆధునిక సాంకేతికతకు అలవాటు పడిన ఒక దేశం ఇలా పూర్తిగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లడం ఆందోళనకరం.
యుద్ధం రగిల్చిన సంక్షోభం
గత ఐదు వారాలుగా ఇరాన్(Internet Ban in Iran) పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. దానికి రివేంజ్‌గా టెహ్రాన్ కూడా ఇజ్రాయెల్, పొరుగు దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ భీకర యుద్ధ వాతావరణంలో సమాచార వ్యవస్థను నియంత్రించేందుకు ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించింది. కేవలం ప్రభుత్వానికి అనుకూలమైన 'వైట్‌లిస్టింగ్' వినియోగదారులకు మాత్రమే నామమాత్రపు సదుపాయం కల్పిస్తూ, సామాన్య ప్రజలను ప్రపంచానికి దూరం చేసింది. శాటిలైట్ కనెక్షన్లు, VPNలపై కూడా కఠినమైన నియంత్రణలు విధించడంతో ప్రజల వద్ద కమ్యూనికేషన్ సాధనాలు లేకుండా పోయాయి.
Also Read : వాషింగ్టన్ మేయర్ బరిలో తమిళనాడు మహిళ.. ఎవరీ రిని సంపత్ !
మానవత్వంపై దెబ్బ
యుద్ధ సమయంలో మౌలిక సదుపాయాలు దెబ్బతినడం సహజమే అయినా, ఉక్రెయిన్ లేదా గాజా వంటి యుద్ధ క్షేత్రాల్లో కూడా ఒక దేశం పూర్తిగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లలేదు. ఇరాన్ తీరు వల్ల అత్యంత క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ఒకరినొకరు సంప్రదించుకోలేక నరకయాతన అనుభవిస్తున్నారని నెట్‌బ్లాక్స్ ఆవేదన వ్యక్తం చేసింది.
తక్షణమే ఆంక్షలను తొలగించాలని అంతర్జాతీయ సంస్థలు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఇరాన్ ప్రభుత్వం నుండి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన రాలేదు. యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఈ డిజిటల్ చీకటి ఎప్పుడు తొలుగుతుందో తెలియక ఇరాన్ ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.
Follow Us