/rtv/media/media_files/2026/04/22/iran-2026-04-22-15-37-44.jpg)
Iran Fires at 2 Ships In Hormuz Hours After Trump's Ceasefire Announcement
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు(us iran war) మళ్లీ ముదురుతున్నాయి. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ పొడిగించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన కొన్ని గంటలకే కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (IRGC) రెండు నౌకలపై దాడులకు పాల్పడింది. ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే ఓ కంటైనర్ నౌకపై గన్‌బోట్‌లతో కాల్పులు జరిపింది. ఆ తర్వాత మరో రవాణా నౌకను కూడా టార్గెట్ చేసి దాడులు చేసింది. ఈ దాడుల్లో నౌకలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే సిబ్బంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ స్పష్టం చేసింది.
Also Read: పహల్గాం దాడి.. రూ. 3 వేల కోసం 26 మంది ప్రాణాలు పణంగా..
ఇటీవల అమెరికా సైన్యం ఇరాన్(america iran war) కు చెందిన వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకునేందుకు యత్నించింది. దీనికి ప్రతీకారంగానే ఇరాన్ ఈ దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ మీడియా కూడా ఈ దాడులు జరిగినట్లు స్పష్టం చేసింది. దీంతో హర్మూజ్ జలాల్లో మరింత భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం పొడిగించిన తర్వాత కూడా ఇరాన్ ఇలాంటి దూకుడు ప్రదర్శించడం కలకలం రేపుతోంది. దీంతో ఇరుదేశాల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Just in: The IRGC Navy opened fire and forced three commercial vessels to return in the Strait of Hormuz after U.S. President Donald Trump announced an indefinite ceasefire at Pakistan’s request. Drone was also launched which was fallen midway (Representative video) pic.twitter.com/SK8h9jgDfu
— Baba Banaras™ (@RealBababanaras) April 22, 2026
Also Read: IRGC చేతుల్లోకి ఇరాన్ పగ్గాలు.. అధ్యక్షుడు పెజెష్కియాన్ డమ్మీయేనా?
చర్చలకు సిద్ధమే.. కానీ
ఇదిలాఉండగా చర్చల విషయంలో ఇరాన్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ ఐక్యరాజ్యసమితిలో దీనిపై స్పందించారు. అమెరికాతో రెండో విడుత చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కానీ హర్మూజ్ జలసంధిలో తమ నౌకలపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయాలనే కండిషన్ పెట్టారు. అమెరికా ఈ ఆంక్షలు తొలగిస్తేనే రెండోసారి చర్చల్లో పాల్గొంటామని స్పష్టం చేశారు. లేకపోతే యుద్ధం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామంటూ వార్నింగ్ ఇచ్చారు.
Follow Us