/rtv/media/media_files/2026/03/31/strait-of-hormuz-2026-03-31-12-26-52.jpg)
Iran approves Strait of Hormuz toll plan, bans America, Israeli vessels
ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్‌లో టోల్ వసూలు చేసేందుకు ఇరాన్ పార్లమెంట్ సెక్యూరిటీ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ఇరాన్ ఆ రూట్ గుండా వెళ్లే నౌకలపై అధికారికంగా టోల్ వసూలు చేయనుంది. ఒక్కో చమురు నౌకకు గరిష్ఠంగా రూ.18.90 కోట్లు వసూలు చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా అక్కడి అధికారిక మీడియా IRBI ఈ విషయాన్ని వెల్లడించింది.
Also Read: ఆలయంలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 8 మంది మృతి
హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తమ సార్వభౌమాధికారన్ని పెంచే దిశగానే ఈ చర్యలు తీసుకున్నట్లు IRBI పేర్కొంది. ఈ నిర్ణయంలో భాగంగా జలమార్గాన్ని పర్యవేక్షించడం, భద్రతను నిర్ధరించడం, ఆర్థిక నిబంధనలు ఉన్నాయని తెలిపింది. అలాగే అమెరికా, ఇజ్రాయెల్‌కు చెందిన నౌకల రాకపోకలపై నిషేధం ఉన్నట్లు చెప్పింది. ఇప్పటిదాకా ఇరాన్ నిర్దేశించిన టోల్ రూల్స్‌ను పాటించి 26 నౌకలు హర్మూజ్ జలసంధిని దాటినట్లు తెలిపింది.
Also Read: సంచలన అప్‌డేట్.. ఇరాన్‌పై అణుబాంబులు వేసేందుకు సిద్ధమవుతున్న అమెరికా
మరోవైపు హర్మూజ్ జలసంధిపై ఇరాన్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ఖండించింది. ఈ జలమార్గాన్ని ఇరాన్ నియంత్రణలోకి తీసుకోవడాన్ని ప్రపంచ దేశాలు అంగీకరించవని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తెలిపారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ జలమార్గాలను కూడా స్వాధీనం చేసుకొని.. తమవి తాముగా చెప్పుకొనే కొత్త విధానం వచ్చిందంటూ విమర్శించారు. ఇరాన్ టోల్ విధించే విధానాన్ని జీ7 దేశాలు కూడా ఖండించాయి. నౌకల స్వేచ్ఛా ప్రయాణాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాయి.
హర్మూజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాకు కీలక మార్గంగా ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ మధ్య ఉన్న ఒక సన్నని జలమార్గం. దీని వెడల్పు అత్యంత తక్కువగా 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20 శాతం ఈ రూట్ నుంచే వెళ్తుంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వల్ల ఈ జలసంధిపై అంతరాయం నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరిగిపోయాయి. ఈ రూట్‌లో ఇరాన్ టోల్ వసూలు చేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే భారత్, చైనా, రష్యా, పాక్ లాంటి పలు మిత్రదేశాలకు మాత్రం మినహాయింపు ఇస్తోంది.
Follow Us