interpoll: అమెరికా నుంచి వచ్చిన వలసదారుల్లో ఇంటర్‌పోల్‌ మోస్ట్‌ వాంటెడ్ నేరగాడు!

అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారుల్లో 104 మంది భారతీయులను ఇటీవల ప్రత్యేక విమానంలో భారత్‌ కు పంపించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఓ వ్యక్తి పేరు ఇంటర్‌ పోల్‌ నేరగాళ్ల జాబితాలో ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..

New Update
US Military Plane Carrying 205 illegal Indian Migrants Lands In Amritsar

US Military Plane Carrying 205 illegal Indian Migrants Lands In Amritsar

America: అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారుల్లో 104 మంది భారతీయులను ఇటీవల ప్రత్యేక విమానంలో భారత్‌ కు పంపించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో ఓ వ్యక్తి పేరు ఇంటర్‌ పోల్‌ నేరగాళ్ల జాబితాలో ఉన్నట్లు తెలుస్తుంది.ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Also Read: America-Trump: ఆ సంస్థలో 9700 మందికి ఉద్వాసన పలికిన ట్రంప్‌ సర్కార్‌!

దీని పై స్థానిక దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టినట్లు పేర్కొన్నాయి. అమెరికా నుంచి 104 మంది అక్రమ వలసదారులతో బయల్దేరిన సీ -17 విమానం బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌ లోని అమృత్‌ సర్ లో దిగింది.ఎయిర్‌పోర్టు చేరుకున్న తరువాత వీరి పత్రాలను అధికారులు క్షుణంగా పరిశీలించారు. ఎలాంటి నేర చరిత్ర లేని వారిని అవసరమైన తనిఖీలు చేసి సొంత ప్రాంతాలకు పంపించారు.

Also Read:America Eggs: అమెరికాలో కోడిగుడ్ల కొరత.. ఏకంగా రూ.35 లక్షల విలువ గల గుడ్లు దొంగతనం!

ఇంటర్‌ పోల్‌ వాంటెడ్‌...

కేసులు,నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని మాత్రం తదుపరి చర్యల కోసం ఓ డిటెన్షన్‌ సెంటర్‌ కు తరలించినట్లు తెలుస్తోంది. క్రిమినల్‌ రికార్డులను పరిశీలించగా..ఓ వ్యక్తి పేరు ఇంటర్‌ పోల్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్నట్లు గుర్తించారట. సదరు వ్యక్తి పై ఇటలీలో కేసు నమోదైనట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.

ఈ కేసుకు సంబంధించిన స్థానిక దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. సదరు వలసదారుడి పై తదుపరి చర్యలు ఎలా ఉండాలనే అంశాన్ని దర్యాప్తు అధికారులు లోతుగా విచారిస్తున్నట్లు సమాచారం.అక్రమ వలసదారుల చేతికి సంకెళ్లు, కాళ్లకు గొలుసులతో బంధించి తీసుకురావడం పై పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే.

ఈ పరిణామాల గురించి  కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ పార్లమెంట్‌ లో ప్రసగించిన సంగతి తెలిసిందే. వలసదారులపై దురుసుగా వ్యవహరించకుండా చూసేందుకు అమెరికాతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు.మరో వైపు ఉపాధి కోసం విదేశాలకు వలస వెళ్లేవారు సురక్షితమైన, క్రమబద్ధమైన ప్రవాస జీవితాన్నిగడిపేందుకు సహకరించేలా, వలసలను క్రమబద్ధీకరించేలా, కొత్తచట్టాన్ని తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Also Read: Hyderabad: రూ.99 కే హైదరాబాద్‌- విజయవాడకి ఈవీ బస్సుల్లో ప్రయాణం..పూర్తి వివరాలు ఇవే!

Also Read:  America: నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్‌ గ్యాప్‌ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు