/rtv/media/media_files/2025/04/11/yaBDY2YMGUhmRofcRtAd.jpg)
US President Trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చాలా తెలివితేటలు ఉపయోగించారు. కొనుగోళ్లకు ఇది గొప్ప సమయం..డీజేటీ అంటూ ట్రంప్ బుధవారం ఉదయాన్నే 9:37కు తన సోషల్ మీడియా ట్రత్ లో పోస్ట్ చేశారు. సరిగ్గా నాలుగు గంటల తర్వాత చైనా మినహా మిగతా దేశాల మీద టారీఫ్ లకు 90 రోజులు బ్రేక్ ఇచ్చారు. దాంతో వాల్ స్ట్రీట్ లో ఎస్ అండ్ పీ 500 సూచీ 4 లక్షల కోట్ల డాలర్ల లాభాన్ని పొందింది. అంతకు ముందు ఇదే సూచీ నాలుగు రోజుల్లో చాలా పోగొట్టుకుంది.
డీజేటీ అంటే..
డీజేటీ అనేది డొనాల్డ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ కార్పొరేషన్. ట్రూత్ సోషల్ మీడియాకు ఇది మెయిన్ సంస్థ. ట్రంప్ ప్రతీకార సుంకాలకు 90 రోజులు విరామం ప్రకటించడంతో ఈ కంపెనీ షేర్ 22.67 శాతం లాభపడింది. ఇందులో అమెరికా అధ్యక్షుడికి 53 శాతం వాటా ఉంది. దీంతో ఆయన సంపద ఒక్కరోజులోనే 415 మిలియన్ డాలర్లు పెరిగింది. ట్రంప్ పోస్ట్ చూసి ఆ కంపెనీపై డబ్బులు పెట్టిన వారికి కూడా బాగా లాభాలొచ్చాయి. అయితే ఇప్పుడు దీని వల్లనే ట్రంప్ కు తలనొప్పులు మొదలయ్యాయి. ఆయన కావాలనే ఆ పోస్ట్ పెట్టారని...దాని వలన డీజేటీకి బాగా లాభాలొచ్చాయని డెమోక్రాట్లు మండిపడుతున్నారు. ట్రంప ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు తన మాట విని షేర్లు కొన్న ఒక సన్నిహితుడికి 2.5 బిలియన్ డాలర్లు , మరొకరికి 900 మిలియన్ డాలర్లు వచ్చాయని ట్రంప్ చెబుతున్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఇన్‌సైడర్ ఇన్‌ఫర్మేషన్ చెప్పడం లేదా ఆ సమాచారంతో ఇతరులకు సహాయం చేయడంపై అమెరికా సెక్యూరిటీస్ చట్టంలో నిషేధం ఉందని వైట్ హౌస్ మాజీ లాయర్ ఒకరు అంటున్నారు. ఆయన తొందరపడి ప్రకటన చేశారని, జాగ్రత్తగా ఉండడం మంచిదని చెబుతున్నారు.
వెనకేసుకొచ్చిన వైట్ హౌస్..
అయితే ఈ విషయంపై వైట్ హౌస్ మాత్రం ట్రంప్ ను వెనకేసుకొస్తున్నట్టు మాట్లాడింది. ఆయన ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడలేదని...అమెరికా ప్రజలకు , మార్కెట్లకు దేశ ఆర్థిక భద్రత మీద నమ్మకం కల్పించడం కోసమే అలా చేశారని వైట్‌హౌస్ ప్రతినిధి కుష్ దేశాయ్ అన్నారు.
today-latest-news-in-telugu | usa | donald-trump | trump tariffs
Also Read: Stock Market: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..