![birth citizenship](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/23/pbOaEuYswaPx2u8vabmm.jpeg)
birth citizenship Photograph: (birth citizenship)
Trump Birthright Citizenship: అగ్రరాజ్యంలో ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికాలో బర్త్ రైట్ సిజిజెన్‌షిప్ రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు. దీనివల్ల ఇకపై అమెరికాలో జన్మించిన పిల్లలకు అక్కడి పౌరసత్వం రాదు. అలా పౌరసత్వం రావాలంటే ఇదివరకే వారి తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు అమెరికా పౌరసత్వం పొంది ఉండాలి. ట్రంప్ తీసుకున్న ఈ జన్మతహా పౌరసత్వం రద్దు ఫిబ్రవరి 20 నుంచి అమలులోకి రానున్నాయి. దీంతో ఫిబ్రవరి 20లోపే పిల్లలు కనాలని అమెరికాలో ఉన్న ఇండియన్స్ హాస్పిటళ్లకు క్యూ కడుతున్నారు.
ఇది కూడా చదవండి : చైనా మరో రికార్డ్.. 1000 సెకన్లపాటు ఆర్టిఫిషియల్ సన్
డెలివరీ డేట్ కంటే ముందే సిజేరియన్..
గర్భంతో ఉన్న మహిళలు డెలివరీ డేట్ కంటే ముందే సిజేరియన్ చేయించుకొని వారి పిల్లలకు అమెరికా పౌరసత్వం అందించాలని తపన పడుతున్నారు. సాధ్యమైనంతవరకు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అమలు కాకముందే సిజేరియన్ చేయించుకోవాలని నెలలు నిండని గర్భిణీలు కూడా అమెరికాలో హాస్పిటల్‌కు క్యూ కడుతున్నారు. 8, 9 నెలలు ఉన్న వారు కూడా ఫిబ్రవరి 20 లోగా ప్రసవం చేయాలని డాక్టర్లను కోరుతున్నారు. నెలలు నిండకున్నా ప్రసవం చేస్తే పిల్లలకు ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నా అమెరికాలో తల్లిదండ్రులు వినడం లేదు.
ఇది కూడా చదవండి : నాకు ఆ అధికారం ఉన్నా కూడా...ట్రంప్ కీలక వ్యాఖ్యలు!
భర్తలు దగ్గరుండి మరీ భార్యలకు నెలలు నిండక ముందే ఆపరేషన్ చేయిస్తున్నారు. సి- సెక్షన్ చేయించుకుంటే పిట్టబోయే పిల్లలకు అవయవాలు పూర్తిగా ఎదగకపోవడం, వారి ఆరోగ్యరిత్యా సమస్యలు ఎదురైయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం ఒక్క ఇండియన్స్ నే కాదు. అమెరికాలో ఉంటున్న అన్నీ దేశాల తల్లిదండ్రులను ఇరకాటంలో పడేసింది. ఎక్కడ తమ పిల్లలు అమెరికాలో పరాయి వారు అవుతారో అని ఇలా చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ
ఇది కూడా చదవండి : GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!