/rtv/media/media_files/2025/01/18/cqRDJc4K18i7UpqzlvWe.jpg)
death
పాకిస్థాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న భారత్‌కు చెందిన ఓ మత్స్యకారుడు మృతి చెందాడు. తన శిక్షా కాలం పూర్తయిన కూడా జైలు అధికారులు అతడిని విడుదల చేయడంలో ఆలస్యం చేశారు. వారి నిర్లక్ష్యం వల్ల చివరికి ఇప్పుడు అతను ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. గత రెండేళ్లలో పాకిస్థాన్‌లో భారత మత్స్యకారుడు మృతి చెందడం ఇది ఎనిమిదో సారి. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2022లో భారత్‌కు చెందిన బాబు అనే మత్స్యకారుడుని ఓ కేసులో పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు.
Also Read: నలుగురు ఇజ్రాయిల్ బందీలను విడుదల చేసిన హమాస్
గత రెండేళ్లుగా అతను కరాచీలోని ఓ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే ఈ కేసులో ఇటీవలే బాబు శిక్షాకాలం పూర్తయ్యింది. అయినా కూడా పాకిస్థాన్ అధికారులు అతడిని విడిచిపెట్టలేదు. శిక్షాకాలం పూర్తిచేసుకున్నప్పటికీ కూడా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అయితే గురువారం అతడు జైల్లో మృతి చెందినట్లు భారత్‌కు చెందిన అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే అతడి మరణానికి గల కారణంపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఇదిలాఉండగా.. ఈ మధ్యకాలంలో చూసుకుంటే పాకిస్థాన్ జైళ్లలో భారత్‌కు చెందిన మత్స్యకారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు తరచుగా జరగడం కలకలం రేపుతోంది. గత రెండేళ్లలో ఇలాంటి ఘటనలు ఎనిమిది జరిగాయి. దీంతో జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలపై పాకిస్థాన్ అధికారులు చూపించే తీరుపై, అక్కడున్న పరిస్థితులపై ఆందోళనలు నెలకొన్నాయి.
Also Read: రాజౌరీ లో ఆగని మిస్టరీ మరణాలు...వైద్యులకు ఇక నుంచి సెలవులు లేవు
ఇక్కడ మరో విషయం ఏంటంటే భారత్‌కు చెందిన దాదాపు 180 మంది మత్స్యకారుల శిక్షాకాలం ఇప్పటికే పూర్తయ్యింది. అయినప్పటికీ వాళ్లు ఇంకా జైళ్లోనే శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్లని విడుదల చేసేందుకు పాక్ అధికారులు వివిధ కారణాలు చెబుతూ జాప్యం చేస్తున్నారు. దీనికి సంబంధించి పాక్ అధికారలుతో భారత్ చర్చలు జరిపినా కూడా వాళ్లలో మర్పు రావడం లేదు.