/rtv/media/media_files/2025/03/27/7mqt0bemMNQMBFQQ0JRf.jpg)
Indian fisherman dies by suicide in Karachi prison
పాకిస్థాన్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓ భారతీయ మత్స్యకారుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. బాత్‌రూమ్‌లో ఆయన ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ జైలు సూపరింటెండెంట్ ఈ విషయాన్ని తెలియజేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. భారత్-- పాకిస్థాన్ జల సరిహద్దులపై సరైన అవగాహన లేకుండా చేపలు పట్టేందుకు వెళ్లే మత్స్యకారులు పాక్ అధికారులుకు దొరికిపోతారు. ఇలాగే భారత్‌కు చెందిన మత్స్యకారుడు గౌరవ్ ఆనంద్‌ను 2022లో పాక్ అధికారులు అదుపులోకి తీసుకొని కరాచీ జైల్లో వేశారు.
Also Read: ఈసారి చార్‌ధామ్ యాత్రలో వీరికి నో ఎంట్రీ.. అలా చేస్తే వెనక్కి పంపిస్తామంటున్న అధికారులు
గత మూడేళ్లుగా అతడు జైల్లోనే ఉంటున్నాడు. మంగళవారం రాత్రి గౌరవ్ ఆనంద్ బాత్‌రూమ్‌కి వెళ్లాడు. తాడుతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు చాలాసేపటి వరకు బయటికి రాలేదు. దీంతో అనుమానించిన జైలు అధికారి లోపలికి వెళ్లి చూశాడు. అప్పటికే గౌరవ్ ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే దానిపై కారణాలు తెలియాల్సి ఉంది. దీనిపై చట్టపరమైన ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందని పాక్ అధికారులు తెలిపారు. అప్పటివరకు మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలాఉండగా గత నెలలో తమ జైల్లో ఉన్న 22 మంది మత్స్యకారులను పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. వాళ్ల శిక్షాకాలం పూర్తి కావడం వల్ల కరాచీలో ఉన్న మాలిక్ జైలు నుంచి విడుదల చేసింది. అయితే మత్స్యకారులు భారత్ పాక్ సరిహద్దులను సరిగా గుర్తించకపోవడం వల్లే రెండు దేశాల్లో ఇలా అరెస్టులు జరుగుతున్నాయి. ఇదిలాఉండగా ఈ ఏడాది జనవరి 1న ఇరుదేశాల ఖైదీల జాబితా మార్పిడి జరిగింది. ఆ లిస్టులో చూసుకుంటే పాకిస్థాన్‌లో 266 మంది భారతీయ ఖైదీలు ఉన్నట్లు తేలింది. అలాగే భారత జైళ్లలో 462 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు తెలిసింది. అయితే తాజాగా పాక్ జైల్లో భారతీయ మత్స్యకారుడు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది.
Also Read: మా జోలికొస్తే వినాశనమే.. తప్పించుకోలేవ్: పుతిన్‌కు నాటో వార్నింగ్!
rtv-news | pakistan | national-news | fisherman