/rtv/media/media_files/2025/02/27/iPcigTK07NMXpTzQIi22.jpg)
bharat
Pak-Ind: ఐక్యరాజ్యసమితిలో దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ మరోసారి గట్టిగా తలస్నానం పోసేసింది. భారత్‌పై పదే పదే ఆరోపణలు చేస్తోన్న పాక్ నాయకుల తీరును జెనీవా వేదికగా జరిగి ఐరాస మానవహక్కుల కౌన్సిల్ 58వ సమావేశంలో ఏకిపారేసింది. మనుగడ కోసం అంతర్జాతీయ సహాయంపై ఆధారపడే ఓ విఫల దేశంగా పాకిస్థాన్‌ను అభివర్ణించింది. పాకిస్థాన్ నాయకత్వం దాని సైన్యం నిర్దేశించిన అబద్ధాలను కొనసాగిస్తోందని ఐరాసలో భారత శాశ్వత మిషన్ ప్రతినిధి క్షితిజ్ త్యాగి ఆరోపించారు.
Also Read: Actress Priyamani: ఛీ మీరు మనుషులేనా అసలు..పుట్టే పిల్లల గురించి కూడా అలాంటి కామెంట్లా!
జమ్మూ కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పాక్ న్యాయ మంత్రి అజామ్ నజీర్ తరార్ చేసిన ఆరోపణలపై త్యాగి కౌంటర్ ఇచ్చారు. ‘‘పాకిస్తాన్ నాయకులు, ప్రతినిధులు వారి సైనిక ఉగ్రవాద సమూహం నిర్దేశించిన అబద్ధాలను ప్రచారం చేయడం విచారకరం..ఇస్లామిక్ దేశాల కూటమిని తన వాణిగా మార్చుకుని దుర్వినియోగానికి పాల్పడి అపహాస్యం చేస్తోంది.. అభివృద్ధిలో అస్థిరత, అంతర్జాతీయ కరపత్రాలపై మనుగడ సాగించే విఫల దేశం ఈ కౌన్సిల్ సమయాన్ని వృధా చేస్తూనే ఉండటం దురదృష్టకరం.
Also Read: SLBC Tunnel: 8మంది ప్రాణాలు డౌటే..ప్రమాదస్థలానికి అరకిలోమీటర్ దూరంలో రెస్క్యూటీమ్..
అప్పటికీ ఎప్పటికీ భారత్‌లో....
దాని మాటల్లో కపటత్వం, అమానవీయ చర్యలతో అసమర్థ పాలనను కొనసాగిస్తోంది.. ప్రజాస్వామ్యం, పురోగతి, మా ప్రజలకు గౌరవాన్ని నిర్ధారించడంపై భారత్ దృష్టి సారించింది. మా నుంచి పాకిస్థాన్ ఈ విలువలు నేర్చుకోవాలి’’ అని త్యాగి చురకలంటించారు.నిరంతరం భారత్ వ్యతిరేక ప్రచారాలతో అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్, లడఖ్‌లు అప్పటికీ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగాలేనని ఆయన పునరుద్ఘాటించారు. ఇటీవలి సంవత్సరాలలో ఈ ప్రాంతాలలో సాధించిన గణనీయమైన అభివృద్ధి, స్థిరత్వాన్ని ఆయన ఎత్తి చూపారు.
‘జమ్మూ కశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు ఎల్లప్పుడూ భారత్లో అంతర్భాగం.. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ అపూర్వమైన రాజకీయ, సామాజిక, ఆర్థిక పురోగతికి ఇది సాక్ష్యంగా నిలుస్తుంది. దశాబ్దాలుగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదంతో బాధపడుతున్న ఈ ప్రాంతంలో సాధారణ స్థితిని తీసుకురావడానికి ప్రభుత్వం నిబద్ధతపై ప్రజలకు ఉన్న నమ్మకానికి ఈ విజయాలు నిదర్శనం. మానవ హక్కుల ఉల్లంఘన, మైనారిటీలపై హింస, ప్రజాస్వామ్య విలువలను నాశనం చేయడమే విధానాలుగా పెట్టుకున్న ఉన్న దేశం.. ఐరాస సాయంతో ఉగ్రవాదులకు ధైర్యంగా ఆశ్రయం ఇచ్చే దేశం ఎవరికీ ఉపన్యాసాలు ఇచ్చే స్థితిలో లేదు’ అని ఆయన తూర్పారబట్టారు.
తన దేశంలోని మైనార్టీలపై వేధింపులు, రాజకీయ అస్థిరత, అంతర్జాతీయంగా నిషేధం ఉన్న ఉగ్రవాదులకు స్వర్గధామైన పాకిస్థాన్‌కు మానవహక్కులు లేదా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదని దుయ్యబట్టారు. గతవారం కూడా ఐరాస భద్రతా మండలిలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్‌కు భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ దిమ్మదిరిగేలా సమాధానం ఇచ్చారు.
Also Read: Weather updates: ఢిల్లీలో వర్షం.. ఈ రాష్ట్రాల్లో నేటి మార్చి 1 వరకు ఉరుములు, మెరుపులతో!
Also Read: Musk: అందుకే వాళ్లు నన్ను చంపాలని చూస్తున్నారు..: మస్క్ సంచలన వ్యాఖ్యలు!