/rtv/media/media_files/2025/02/12/XmxvQeNNkqvb0szGQxW1.jpg)
PM Modi, USA President Trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బాధ్యతలు చేపట్టాక అక్రమవలస చట్టాన్ని తీసుకువచ్చారు. వచ్చిన రోజునే ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు. అప్పటి నుంచి అన్ని దేశాల అక్రమవలసదారులను పట్టుకుని మరీ వెనక్కు పంపించేస్తున్నారు. ప్రత్యేక యుద్ధ విమానాల్లో వారందరినీ వారి దేశాలకు పంపిస్తున్నారు ట్రంప్. భారతదేశీయులను కూడా వెనక్కు పంపించారు. మొదటి విడతలో 44 మందిని పంపారు. ఇప్పుడు మరో రెండు రోజుల్లో మరో రెండు విమానాల్లో మరి కొంత మంది భారతీయ అక్రమవలసదారులు వెనక్కు రానున్నారు.
Also read : రెచ్చిపోయిన మోహన్‌బాబు బౌన్సర్లు.. తిరుపతిలో రౌడీయిజం .. ఏం చేశారంటే!
అక్రమ రవాణాను అరికట్టాలి..
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈరోజు భేటి అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అక్రమ వలసదారులపై కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌లో అక్రమంగా ఉంటున్న తమ పౌరుల్ని భారత్ తిరిగి స్వీకరింస్తుందని చెప్పారు. అదే సమయంలో మానవ అక్రమ రవాణాని అంతం చేయడానికి ప్రయత్నాలు అవసరమని చెప్పారు. ట్రంప్ సరైన పనే చేస్తున్నరని మోదీ వెనకేసుకొచ్చారు. ఒక దేశంలో అక్రమంగా నివసించే ఎవరికైనా అక్కడ ఉండే హక్కు లేదని...ఇది ప్రపంచమంతటకీ వర్తిస్తుందని మోదీ అన్నారు. భారత్‌లోని చాలా మంది యువకులు, పేద ప్రజలు వలసల బారిన పడి మోసపోతున్నారు. వీరు చాలా పేద లేదా మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినవారే. ఇక్కడకు వచ్చిన వారందరూ పెద్ద కలలతో వస్తున్నారని..అలాగే చాలా మందిని ఎందుకు తీసుకెళ్తున్నారో తెలియకుండానే ఏజెంట్లు తీసుకువస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. చాలా మందిని మానవ అక్రమ రవాణా వ్యవస్థ ద్వారా తీసుకువస్తున్నారని చెప్పారు. మానవ అక్రమ రవాణా ఎకో సిస్టమ్‌ని అంతం చేయడానికి భారత్, అమెరికా సంయుక్తంగా పనిచేయాలని అన్నారు.