LPG Crisis: గ్యాస్ కొరత.. తెలంగాణలో హోటళ్లకు 2 రోజుల్లో రూ.20 కోట్ల నష్టం

దేశంలో నెలకొన్న గ్యాస్ కొరత తెలంగాణలోని హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత రెండ్రోజుల్లో ఏకంగా రూ.20 కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న సిలిండర్లు మరో 2-3 రోజుల వరకే సరిపోనున్నాయి.

New Update
Hotels in Telangana losses Rs. 20 crore in 2 days due to gas shortage

Hotels in Telangana losses Rs. 20 crore in 2 days due to gas shortage

దేశంలో నెలకొన్న గ్యాస్ కొరత తెలంగాణలోని హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. గత రెండ్రోజుల్లో ఏకంగా రూ.20 కోట్ల నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతమున్న సిలిండర్లు మరో 2-3 రోజుల వరకే సరిపోనున్నాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లాల్లో చాలా హోటళ్లు వంటలు చేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 50 వేల హోటళ్లు ఉన్నాయి. రోజుకు ఏకంగా రూ.300 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. దాదాపు కోటి కుటుంబాలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. గ్యాస్ కొరత వల్ల రెండ్రోజుల్లో హోటళ్లుకు రూ.20 కోట్ల నష్టం జరిగినట్లు సమాచారం.  

Also Read: దేశంలో ఇంధన సంక్షోభం.. ఉద్యోగులకు వర్క్‌ ఫ్రం హోం !

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇరాన్ హర్ముజ్ జలసంధిని మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ దేశాలకు చమురు, గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే పలు దేశాల్లో వీటి కొరత నెలకొంది. భారత్‌లో కూడా దీని ప్రభావం కనిపిస్తోంది. పలు నగరాల్లో కొందరు హోటల్ యజమానులు తమ హోటళ్లు మూసివేసినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో కూడా 2 రోజులకు సరిపడా గ్యాస్ ఉందని.. ఆ తర్వాత ఇక్కడ కూడా హోటళ్లు మూతపడే పరిస్థితులు వస్తాయని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు కేంద్రం మాత్రం దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది. ఎల్పీజీ ఉత్పత్తిని 10 శాతం పెంచినట్లు పేర్కొంది. 

Also Read: యుద్ధంలోకి ఉత్తర కొరియా ఎంట్రీ.. అమెరికాకు కిమ్ వార్నింగ్

Advertisment
తాజా కథనాలు