/rtv/media/media_files/2026/04/20/fotojet-2026-04-20-09-36-23.jpg)
US seizes Iranian merchant ship
Hormuz Tensions : హర్మూజ్ జలసంధి(US Navy Hormuz) వేదికగా అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో చోటుచేసుకున్న తాజా పరిణామాల నేపథ్యంలో ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
హర్మూజ్ జలసంధి సమీపంలో ఇరాన్ జెండాతో ప్రయాణిస్తున్న 'తౌస్కా' (Touska) అనే భారీ వాణిజ్య నౌకను అమెరికా నౌకాదళం వ్యూహాత్మకంగా అడ్డుకుంది. సుమారు 900 అడుగుల పొడవున్న ఈ రవాణా నౌక, అమెరికా విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని ధిక్కరించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన శక్తివంతమైన డెస్ట్రాయర్ 'USS SPRUANCE', తౌస్కా నౌకను గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో అడ్డగించింది. తొలుత హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఇరాన్ నావికులు స్పందించకపోవడంతో అమెరికా దళాలు కాల్పులు జరిపి నౌకను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.
Also Read : అమెరికాలో ఉన్మాది కాల్పులకు... 8 మంది చిన్నారులు బలి
US Seizes Iranian Merchant Ship
JUST IN: The US Navy has just "blown a hole" through the engine room of an Iranian-flagged cargo ship that tried getting through the Navy blockade of the Strait of Hormuz.
— Collin Rugg (@CollinRugg) April 19, 2026
"Vacate your engine room! Vacate your engine room," American forces could he heard warning the Touska cargo… pic.twitter.com/ROA6Q7IO09
Also Read : మరో జలసంధికి మూసివేత ముప్పు.. బాబ్ అల్ మాండెబ్ పై హూతీల సంచలన ప్రకటన..
ఈ కీలక పరిణామాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరించారు. ఇరాన్(Iran US Ceasefire) నావికులు తమ హెచ్చరికలను బేఖాతరు చేయడంతోనే కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. నౌకను నిలిపివేయడానికి నేరుగా దాని 'ఇంజిన్ రూమ్' లక్ష్యంగా కాల్పులు జరిపినట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా ఈ సీజింగ్‌కు సంబంధించిన వీడియో ఫుటేజీని విడుదల చేస్తూ, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించినందుకే నౌకను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది.
అమెరికా చర్యపై ఇరాన్(Iran US Isarel War) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని 'సాయుధ పైరసీ' (Armed Piracy) గా అభివర్ణించిన ఇరాన్, తక్షణమే ప్రతీకార చర్యలకు దిగింది. ఇరాన్ సైనిక దళం (IRGC) అమెరికా యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లను ప్రయోగించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా సంస్థ 'ప్రెస్ టీవీ' వెల్లడించింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్ ప్రాంతం నుండి అమెరికా నౌకలను తరిమికొట్టినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే ఈ డ్రోన్ దాడుల వల్ల అమెరికా నౌకలకు జరిగిన నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు.
ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి వద్ద ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పతాకస్థాయికి చేరడంపై అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణం వల్ల చమురు ధరలు పెరిగే అవకాశం ఉండటమే కాకుండా, సముద్ర మార్గంలో వాణిజ్య నౌకల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ వివాదం శాంతియుతంగా సమసిపోతుందా లేక పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తుందా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ కలిగిస్తోంది.
Follow Us