/rtv/media/media_files/2026/04/20/high-flying-iranian-woman-charged-with-moving-arms-worth-millions-for-iran-2026-04-20-14-55-44.jpg)
High-Flying Iranian Woman Charged With Moving Arms Worth Millions For Iran
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేపట్టిన నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఈ సమయంలో అమెరికాకు చెందిన ఓ మహిళా వ్యాపారవేత్త ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్లు, బాంబులు సరఫరా చేస్తోంది. అయితే తాజాగా ఆమె అరెస్టయ్యింది. షమీమ్ మాఫి అనే మహిళా వ్యాపారవేత్త ఇరాన్‌కు యుద్ధ సామగ్రిని సరఫరా చేస్తోందన్న ఆరోపణలతో అమెరికా అధికారులు ఆమెను శనివారం రాత్రి లాస్ ఏంజిలెస్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
Also Read: గాల్లో 4 గంటల నరకం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న ప్రయాణికులు!
వాస్తవానికి షమీమ్ మాఫి(44)కి ఇరాన్ మూలాలున్నాయి. 2013లో ఇరాన్ నుంచి అమెరికాకు వలస వచ్చి అక్కడే స్థిరపడింది. 2016లో శాశ్వత నివాసానికి గుర్తింపు (గ్రీన్‌కార్డు మంజూరు) వచ్చింది. ఇటీవల అక్రమంగా యుద్ధ సామాగ్రిని సరఫరా చేసేందుకు ఇరాన్ సర్కార్‌తో ఆమె ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు గుర్తించారు. డ్రోన్లు, బాంబులు ఇతర ఆయుధ సామాగ్రిని తరిస్తున్నట్లు విచారణలో తేలింది. వీటిని సరఫరా చేసేందుకు ఆమె ఇరాన్‌తో 70 మిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2023లో సూడాన్‌లో అంతర్యుద్ధం జరగగా ఆ దేశ మంత్రిత్వ శాఖకు కూడా ఆమె 55 వేల బాంబు ఫ్యూజ్‌లు సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి.
Also Read: జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
అంతేకాదు షమీమ్ 2022 డిసెంబర్, 2025 జూన్‌లో ఇరాన్ మంత్రిత్వశాఖతో నేరుగా సంప్రదింపులు చేసిన ఫోన్‌కాల్ రికార్డులు కూడా బయటికొచ్చాయి. వీటిని పోలీసులు కోర్టుకు సమర్పించారు. అయితే ఇరాన్ తనను మధ్యవర్తిత్వం వహించమని ఎప్పుడు కోరలేదని నిందితురాలు తనపై వచ్చిన ఆరోపణలను ఖండించింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ టీమ్ మళ్లీ పాకిస్థాన్‌లో ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు వెళ్లనుంది. ఇలాంటి సమయంలో ఆమె అరెస్టు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Follow Us