Trump-Hamas: ట్రంప్‌ వార్నింగ్‌ ని పట్టించుకోని హమాస్‌...బందీలను విడుదల చేసేదే లేదంటూ ప్రకటన!

పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారేలా కనపడుతుంది. హమాస్‌కు నరకం చూపిస్తానని ట్రంప్ ప్రకటించిన తరువాత అరబ్‌ దేశాలు మండిపడుతున్నాయి. ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయబోమని హమాస్ ప్రతినిధులు ప్రకటించారు.

New Update
israel

israel

పశ్చిమాసియా మరోసారి అగ్నిగుండంగా మారేలా కనపడుతుంది. ఏడాదికి పైగా ఇజ్రాయెల్‌ చేసిన దాడులతో గాజా ఎక్కడుందో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. వందలాది మంది పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో హమాస్ ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడం జరిగింది. ఇజ్రాయెల్.. పాలస్తీనా ఖైదీలను విడుదల చేయడం జరుగుతోంది. 

Also Read: Odisha rapper:భార్యతో గొడవలు..ప్రముఖ రాపర్‌ ఆత్మహత్య!

అయితే ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. గాజాను స్వాధీనం చేసుకుంటామని.. పాలస్తీనియన్లను జోర్డాన్, ఈజిప్ట్‌లకు తరలిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా ఈ శనివారంలోపు బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని.. లేకుంటే హమాస్‌కు నరకం చూపిస్తానని ట్రంప్ ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Also Read: అలా చేస్తే ఊరుకునేది లేదు.. APSRTC సిబ్బందికి సీరియస్ వార్నింగ్

ఈ ప్రకటన తర్వాత అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. తాజాగా ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో హమాస్ ప్రతినిధి సమీ అబు జుహ్రీ స్పందించారు. శనివారం ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయబోమని స్పష్టం చేశాడు. ఈ మేరకు జెరూసలేం పోస్ట్‌తో అన్నారు. అల్-జజీరాతో జరిగిన ప్రత్యేక సంభాషణలో ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో అంగీకరించిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని.. ఒకేసారి బందీలను విడుదల చేసేదీలేదని స్పష్టం చేశారు. 

ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించారు. అందుకోసమే బందీల విడుదలలో జాప్యం జరుగుతోందని హమాస్ ప్రతినిధి పేర్కొన్నారు. జనవరి 19 నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. హమాస్ దగ్గర 76 మంది ఇజ్రాయెల్ బందీలు ఉన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం మొదటి దశ ఆరు వారాల పాటు కొనసాగనుంది. ఇప్పటి వరకు హమాస్ 16 మంది ఇజ్రాయెల్ బందీలను సజీవంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఒప్పందంలో భాగంగా శనివారం మరో ముగ్గురు బందీలను హమాస్ విడుదల చేయనుంది. 

అగ్గి మీద గుగ్గిలం..

కానీ ట్రంప్ మాత్రం మొత్తం బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని అల్టిమేటం విధించారు. అందుకు హమాస్ ససేమిరా అంటోంది. ఇంకోవైపు ఇజ్రాయెల్ కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేస్తోంది. లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ యుద్ధ సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మంగళవారం ట్రంప్ హమాస్‌ను హెచ్చరించారు. ‘‘నాకు సంబంధించినంతవరకు శనివారం 12 గంటలలోపు బందీలందరినీ తిరిగి అప్పగించాలి. ఇది సరైన సమయం అని నేను భావిస్తున్నాను. లేదంటే కాల్పు విరమణ ఒప్పందం రద్దు చేయమని చెబుతాను. అన్ని మార్గాలు మూసిపోతాయి. అనంతరం నరకం చూస్తారు.’’ అంటూ ట్రంప్ హెచ్చరించారు.

Also Read: Supreme Court: మీరు విదేశాలకు వెళ్తే తిరిగొస్తారన్న నమ్మకం లేదు..ఇంద్రాణీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు

Also Read: Goutham Aadani: జీత్‌ వెనుక ఉన్న నిజమైన శక్తి ఎవరో తెలుసా అంటున్న గౌతమ్‌ అదానీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు