USA: హెచ్–1 వీసాదారులకు గుడ్‌ న్యూస్.. స్టాంపింగ్‌ ఇక అమెరికాలోనే...

హెచ్–1 బీ వీసాదారులకు అమెరికా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక మీదట వీసా రెన్యువల్, స్టాంపింగ్ కోసం ఎవరూ స్వదేశాలకు వెళ్ళన్నక్కర్లేదని తెలిపింది. మొత్తం ప్రక్రియలన్నీ యూఎస్‌లోనే చేసుకోవచ్చును. ఇది ఈ ఏడాది నుంచే ప్రారంభం అని కూడా తెలిపింది. 

New Update
USA Tourist Visa:యూఎస్ పర్యాటక వీసాదారులకు గుడ్‌న్యూస్..డ్రాప్ బాక్స్ సదుపాయం

మొత్తానికి హెచ్–1 బీ వీసాదారుల పంట పండే రోజులు వచ్చాయి. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. వీసా రెన్యువల్, స్టాంపింగ్ కోసం ఎవరూ తమ దేశాలకు వెళ్ళక్కర్లేదని యూఎస్ ఎంబసీ శుభవార్త చెప్పింది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశంలో ఉన్న భారతీయులకు ఇది సూపర్ డూపర్ న్యూస్ అయింది. భారత్‌కు రాకుండానే హెచ్ 1 బీ వీసా రెన్యూవల్ చేసుకునేలా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని ఎంబసీ తెలిపింది. ఈ మేరకు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వివరాలను ప్రకటించింది. హెచ్ 1 బీ వీసా రెన్యూవల్ ప్రక్రియను ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. అయితే ఎప్పటి నుంచి, ఏ నెల, తేదీ నుంచి అన్నది మాత్రం ఇంకా చెప్పలేదు. 

అబ్బ పెద్ద సమస్య తప్పింది..

ఇది అమెరికాలో ఉన్న భారతీయులకు నిజంగా ఆనందం కలిగించే విషయం. ఎందుకంటే ఇప్పటివరకూ హెచ్–1 స్టాంపింగ్ అనేది వాళ్ళకి పెద్ద తలనొప్పిగా ఉంది. అపాయింట్‌మెంట్ స్లాట్లు పొందితేనే హెచ్– 1 బీ వీసా రెన్యూవల్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో హెచ్ – 1 బీ వీసాదారులకు స్లాట్లు దొరకడం కష్టంగా మారుతోంది. ఇప్పుడు ఈ కొత్త రూల్ ద్వారా అమెరికాలోనే అన్నీ జరిగిపోతాయి కాబట్టి రెన్యువల్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది ఇక మీదట. 

ఇది కూడా చదవండి: Justin Trudeau: కెనడా ప్రధాని రాజీనామా.. సొంత పార్టీ నేతల కారణంగానే!

భారతీయులే అధికం..

హెచ్– 1 బీ వీసా రెన్యూవల్ అంశంలో ఇప్పటికే అమెరికా పైలెట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసింది. ఇక దీన్ని ఆచరణలో పెట్టడమే మిగిలింది. అమెరికాలో జారీ చేసే హెచ్– 1 బీ వీసాల్లో భారతీయులే అత్యధికంగా ఉంటున్నారు. ప్రతీ ఐదు హెచ్–1 బీ వీసాల్లో ఒకరు భారతీయులే ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి.  దీనికి తోడు ఈ వీసాల మీద చాలా కంప్లైటంస్, కాంట్రవర్శీలు కూడా నడుస్తుంటాయి ఎప్పుడూ. ట్రంప్ వస్తే అక్రమ వలసలతో పాటూ వీసాల కుదింపు కూడా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ ట్రంప్‌తో పాటూ ఏర్పాటవ్వబోయే కొత్త ప్రభుత్వంలో సభ్యలైన ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలాంటి వారు హె–బీ వీసాలకు అనుకూలంగా ఉన్నారు. వీసాల తగ్గింఉ ఆలోచన వారికి లేదని తెలుస్తోంది. అయితే వీసాలు జారీ చేసేటప్పుడే కొంత రిస్ట్రిక్షన్ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. 2023 లో భారత దేశం నుంచి 72.3 శాతం హెచ్–1బీ వసాలను 3.86 లక్షల మంది పొందారు. ఇక 2024లో ఇది మరికొంచెం పెరిగింది.    

ఇది కూడా చదవండి: BIG Breaking : వదలని ఏసీబీ.. కేటీఆర్కు మళ్లీ నోటీసులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Trump: ఆ దేశం అస్సలు వెళ్లకండి.. అమెరికన్లకు ట్రంప్‌ హెచ్చరిక

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది.

New Update
Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

Do not travel to Bahamas, there are sharks:,Trump admin advises Americans

ట్రంప్ సర్కార్‌ కీలక ప్రకటన చేసింది. పర్యాటక రంగంలో ప్రసిద్ధి చెందిన బహమాస్‌కు వెళ్లే అమెరికన్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. అక్కడ నేరాలు, షార్క్‌ దాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వీలైతే ఆ దేశం వెళ్లకూడదని కోరింది. బహమాస్ అనేది కామన్వెల్త్ దేశాల్లో ఒక స్వతంత్ర దేశం. పర్యాటక పరంగా దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య అక్కడికి వెళ్లే పర్యటకులపై కొందరు దుండగులు దోపిడీలకు పాల్పడుతున్నారు. 

Also Read: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

అంతేకాదు మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు. ఆఖరికీ హత్యలకు కూడా చేయడానికి వెకాడటం లేదు. అలాగే బహమాస్ సముద్ర జలాల్లో షార్క్‌ దాడుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే ఆ దేశానికి వెళ్లకూడదని ట్రంప్ సర్కార్ ప్రజలకు సూచనలు చేసింది.అక్కడ అద్దె గదుల్లో కూడా ఉండటం సురక్షితం కాదని చెపింది. ప్రైవేట్ సెక్యూరిటీ లేని ప్రాంతంలో బస చేయడం మంచిది కాదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి మార్చి 31న ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

పర్యాటకులు మార్గదర్శకాలను నిర్లక్ష్యం చేసి ఆయుధాలు, తుపాకులు తీసుకెళ్లడం చట్టారీత్యా నేరమంటూ హెచ్చరించింది. రూల్స్‌ ఉల్లంఘిస్తే ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు కఠినంగా చర్యలు తీసుకుంటారని తెలిపింది. అరెస్టులు, జైలుశిక్ష, జరిమానా విధిస్తారని మార్గదర్శకాల్లో పేర్కొంది. 

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

trump | telugu-news | rtv-news | usa

Advertisment
Advertisment
Advertisment