/rtv/media/media_files/2025/03/23/KsfPM3GReGZkqVt5x0D7.jpg)
Gujarati father and daughter Photograph: (Gujarati father and daughter)
అమెరికాలో రెచ్చి పోయిన ఓ తాగుబోతు స్టోర్ ఓనర్, ఆయన కూతుర్ని కాల్చి చంపాడు. గుజరాత్కు చెందిన తండ్రి, కూతురు అమెరికాలోని వర్జీనియాలో ఉన్న ఒక డిపార్ట్మెంట్ స్టోర్ ముందు జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో చనిపోయిన తండ్రీకూతురును గుజరాత్కు చెందిన ప్రదీప్ భాయ్ పటేల్ (56), ఆయన కూతురు ఉర్మి (26)గా వర్జీనియా పోలీసులు గుర్తించారు. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
Also read: AC explosion: ఇంట్లో AC పేలి ఫ్యామిలీలో నలుగురు మృతి.. మరొకరికి తీవ్రగాయాలు
Also Read : థంబ్‌నెయిల్ కోసం నా భర్తను చంపేశారు!.. నటి భార్గవి ఫైర్
US Firing In Virginia
Tragic Loss in the US:
— Tarun 🚩🇮🇳 (@fptarun) March 23, 2025
A 56-year-old Indian man & his 24-year-old daughter were shot dead at a Virginia store where they worked. The accused, George Wharton, opened fire after asking why the store was closed at night.
The Patel family, originally from Mehsana, Gujarat; had… pic.twitter.com/8oxjetXACZ
Also Read : SRH వైల్డ్ ఫైర్.. సోషల్ మీడియాలో మీమ్స్ పేల్చుతున్న ఫ్యాన్స్
కాల్పులకు తెగబడిన దుండగుడిని ఆఫ్రికన్-అమెరికన్ అయిన జార్జ్ ఫ్రాజిర్ డెవన్ వార్టన్గా గుర్తించారు. డిపార్ట్మెంట్ స్టోర్ ప్రదీప్ భాయ్ పటేల్కు చెందినదిగా పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున స్టోర్ తెరవడానికి వచ్చిన ప్రదీప్, ఆయన కూతురు ఉర్మితో నిందితుడు గొడవ పడినట్లు తెలిసింది. ఆల్కహాల్ కొనడానికి వస్తే స్టోర్ ఎందుకు మూసేశారని వాదనకు దిగాడు. రాత్రంతా తాను స్టోర్ ముందే వేచి చూస్తూ ఉన్నానని తండ్రీకూతురితో నిందితుడు ఘర్షణకు దిగాడు. ఈ గొడవలో సహనం కోల్పోయిన జార్జ్ ఫ్రాజిర్ డెవన్ వార్టన్ తన దగ్గరున్న గన్ తీసుకొని వారికి షూట్ చేశాడు. ఈ కాల్పుల్లో ప్రదీప్ శరీరంలో రెండు బులెట్లు దిగాయి. ఉర్మిపై ఒకసారి కాల్పులు జరిపాడు. దీంతో తండ్రి అక్కడిక్కడే స్పాట్‌లో చనిపోగా.. ఆయన కూతురు ఉర్మిని ఆసుపత్రికి తరలించి వెంటిలేటర్పై చికిత్స అందిస్తుండగా చనిపోయింది. ఈ ఘటన జరిగిన రెండు గంటల వ్యవధిలోనే అమెరికా పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆరేళ్ల క్రితం ప్రదీప్ భాయ్, అతని భార్య హన్సాబెన్ విజిటర్ వీసాపై తమ కూతురు ఉర్వితో కలిసి అమెరికాకు వెళ్లారు.
Also read: నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు : KTR
latest-telugu-news | father and daughter incident | shooting | america firing | today-news-in-telugu | international news in telugu