/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/google-jpg.webp)
ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్ లో పని చేసే ఉద్యోగులు జీతాల పెంపు పై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఉద్యోగులు అనుకున్న స్థాయిలో ఈ సంవత్సరం జీతాల పెంపు లేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ అంశాన్ని సంస్థ ఉద్యోగులు ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు బిజినెస్ ఇన్ సైడర్ తన కథనంలో పేర్కొంది.
Also Read: Putin:ఆ వ్యవహారంతో మాకు సంబంధం లేదంటున్న పుతిన్!
మార్చి 25న జరిగిన సమావేశంలో జీతాల పెంపు విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇందులో చాలా మంది ఉద్యోగులు తాజా పెంపు పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కంపెనీ ఆర్థిక సామర్థ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ 2025 సంవత్సరానికి గానూ ప్యాకేజీని స్వల్పంగా పెంచినట్లు తెలిపారు.
Also Read: Canada: అమెరికాతో ఆ బంధం ముగిసింది.. ఇక ప్రతి చర్య తప్పదు: కెనడా!
ముఖ్యంగా జీవన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో గణనీయమైన జీతాల పెరుగుదల లేకపోవడంతో నిరాశ చెందారు. ఈ విషయం పై గూగుల్ వైస్ ప్రెసిడెంట్ జాన్ కేసీ స్పందించారు. 80 శాతం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు 2025 లో తమ వేతనాల్లో గతేడాదితో పోలీస్తే పెరుగుదల చూశారని తెలిపారు.
అయితే నాన్ టెక్నికల్ తో పాటు కొన్ని విభాగాల్లోని వారు మాత్రం తక్కువ ప్యాకేజీలు అందుకున్నట్లు ఆయన అంగీకరించారు. తక్కువ జీతాల పెంపును ఎదుర్కొన్న ఉద్యోగులకు మెరుగైన వేతనం చెల్లించాలని గూగుల్ కోరుకుంటోందని జాన్ కేసీ పేర్కొన్నారు. అయితే అధిక పనితీరు కనబరిచిన వారిని ప్రోత్సాహించేలాఈ పెంపు ఉంటుందని తెలిపారు.
గూగుల్ జీతాల పెంపు గతేడాదిలో పెంచిన 8-10 శాతం జీతంతో పోలిస్తే కేవలం 3 శాతం మాత్రమే పెంచినట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.ఇదిలా ఉంటే..గూగుల్ గతేడాది డిసెంబర్ లో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. మేనేజర్,డైరెక్టర్లు, వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో పని చేస్తున్న వారిలో 10 శాతం మందికి లే ఆఫ్ లు ఇచ్చింది. ఏఐ సంస్థల నుంచి పోటీపెరుగుతున్నవేళ తన సామర్థ్యాలను మెరుగుపరచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొంది.
Also Read:Elon Musk: ఫెడరల్ HRలో ట్రంప్ విధేయులు.. ఒత్తిడిలో ఉద్యోగులు...అంతా మస్క్ పుణ్యమేనా!
Also Read: Kerala:ఒక్క సిరంజీ . 10 మందికి ఎయిడ్స్!
google | salaries | hike | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates